క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. చూడాల‌ని ఉంద‌నేవాళ్లు కూడా కోట్ల‌లోనే

ఎప్పుడూ త‌న‌కు రాజ‌కీయాలు ప‌డ‌వ‌ని, పెద్ద‌గా వాటి గురించి కూడా మాట్లాడ‌బోన‌ని చెబుతూ ఉండే లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తాజాగా రాజ‌కీయ అరంగేట్రానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడ‌ట‌! త‌మిళ‌నాడులో ఇప్పుడు ఏర్ప‌డిన పొలిటిక‌ల్ గ్యాప్ త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని ప‌లువురు ఇచ్చిన స‌ల‌హా నేప‌థ్యంలో క‌మ‌ల్ ఇప్పుడు పొలిటిక‌ల్ డెసిష‌న్ తీసుకున్నాడ‌ని స‌మాచారం. వాస్త‌వానికి త‌మిళ‌నాడులో మాజీ సీఎం జ‌య‌లలిత‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డ క‌మ‌ల్‌.. ఆమెకు వ్య‌తిరేకంగా మాట్టాడి సంచ‌ల‌నం సృష్టించారు. ఆమె మ‌ర‌ణం అనంత‌రం […]

తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేక‌ర్ వేసే నాయ‌కులు ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీలుగా కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్ట‌ర్ షో వేస్తున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ట్రెండ్స్‌ను బ‌ట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మ‌రోసారి సీఎం అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌కు, స‌మ‌ర్థులైన నాయ‌కుల‌కు కొర‌త లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడ‌ర్లు అన్న చందంగా […]

కోదండ‌రాం పార్టీతో టీఆర్ఎస్‌కు ఎఫెక్ట్ ఎంత‌

దేశంలో ఉద్య‌మాల మీద‌ ఉద్య‌మాలు చేసి ప‌ట్టుబ‌ట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చ‌రిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మ‌రో రికార్డు సృష్టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటిక‌ల్‌గా తెలంగాణ మ‌రో యూ ట‌ర్న్ తీసుకుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్య‌మ స‌మ‌యంలో అన్నీతానై మేధావులను క‌దిలించి నిత్యం ప‌త్రిక‌ల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టిక‌ల్‌తో ఉద్య‌మాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్పుడు స‌రికొత్త‌గా పార్టీకి శ్రీకారం చుడుతున్నార‌నే వార్తలు […]

రేవంత్ సొంత కుంప‌టి!

తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఎదిగిన రేవంత్‌.. తెలంగాణ‌లో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారార‌న‌డంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న ప‌ద్ధ‌తిలోనే ఉండిపోవు క‌దా! ఈ క్ర‌మంలోనే రేవంత్ కూడా భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నిక‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. […]