కొత్త పార్టీ స్థాప‌న‌..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!

ప్ర‌జ‌ల భూముల‌ను కబ్జా చేశార‌ని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగ‌తి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంట‌నే ఆయ‌న‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయ‌డంతో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]

ర‌జ‌నీ కొత్త పార్టీపై షాకింగ్ ట్విస్ట్‌… ఆ పార్టీతో పొత్తు..!

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీపై గ‌త యేడాది కాలంగా త‌మిళ‌నాడు మీడియాలో ఎన్నో వార్త‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తార‌ని ఓ సారి, ఆయ‌న బీజేపీలోకి వెళ‌తార‌ని మ‌రోసారి, ర‌జ‌నీ కొత్త పార్టీ పెట్టి, బీజేపీతో కలుస్తార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌జ‌నీ కొద్ది రోజులుగా త‌న అభిమాన సంఘాల‌తో మీట్ అవుతున్నారు. ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తార‌న్న వార్త‌ల‌తో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆయ‌న్ను […]

తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!

త‌లైవా ర‌జ‌నీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ తెర వెన‌క శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ర‌జ‌నీ ర‌మ్మంటే వ‌చ్చేసేందుకు కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళ‌నాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ర‌జ‌నీ ఏ రేంజ్‌లో వ‌స్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ర‌జ‌నీ ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీ కోసం బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ చాలా […]

ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ.. వాళ్ల‌కి న‌చ్చ‌డం లేదా?!

ఏ స్టార్ హీరో అయినా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్ప‌ని అభిమానులు ఉండ‌రు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్‌లోకి వ‌స్తారా? అని ఎదురు చూసే జ‌నాల‌కూ త‌క్కువ‌కాదు. ఏపీలో ఎన్‌టీఆర్‌, త‌మిళ‌నాట ఎంజీఆర్‌లు పార్టీలు పెట్టిన‌ప్పుడు జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆ త‌ర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువ‌త, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్ల‌కు కామ‌న్‌గానే ప్ర‌జ‌ల నుంచి ద‌క్కే రెస్పెక్ట్‌. ఇక‌, తాజాగా త‌మిళ‌నాడులో త‌లైవా ర‌జ‌నీ […]

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రజినీ పార్టీ

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై దాదాపు ద‌శాబ్ద కాలంగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు గ‌త ప‌ది రోజులుగా బాగా ఎక్కువ‌వుతున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. అప్ప‌టి నుంచి ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఒత్తిడి తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీ చాలా రోజుల త‌ర్వాత త‌న అభిమానుల‌తో భేటీ కావ‌డం కూడా ఆయ‌న […]

తెలుగు గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్త‌గా ఆవిర్భ‌వించిన జ‌న‌సేన‌.. ఇంకా కొన్ని చిన్న చిన్న‌ పార్టీలు లెక్కకు మంచి ఉండ‌నే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓట‌ర్లు గంద‌ర‌గోళ‌ప‌డుతుంటే ఇప్పుడు మ‌రో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ ప‌క్క‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ […]

కోదండ‌రామ్ పార్టీపై కొత్త ట్విస్ట్‌…!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీకి కూడా మ‌నుగ‌డ లేకుండా చేసేశారు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌! కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి పార్టీల అస్థిత్వాన్ని ప్ర‌శ్నార్థ‌కం చేసి టీఆర్ఎస్ ఒక్క‌టే తెలంగాణ పార్టీ అనేంత‌గా చేసేశారు. అయితే టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా మరో కొత్త పార్టీని జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ప్రారంభించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నా.. వాటిని ఖండిస్తూనే ఉన్నారు. కానీ తెర వెనుక ఈ పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయట‌. ఇప్ప‌టి నుంచే పార్టీలోకి చేరే వారికి […]

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌

చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరో అయిన నంద‌మూరి హీరో ఎన్టీఆర్…మూడు ప‌దుల వ‌య‌స్సు కూడా రాకుండానే పొలిటిక‌ల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రెండు ప‌దుల వ‌య‌స్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్ట‌ర్ మూవీతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ త‌ర్వాత 2009లో టీడీపీకి ప్ర‌చారంలో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు అటు నంద‌మూరి ఫ్యామిలీతోను, ఇటు నారా ఫ్యామిలీతోను గ్యాప్ వ‌చ్చింది. రాజ‌కీయంగా త‌న కొడుకు లోకేశ్‌కు ఎన్టీఆర్ పోటీ వ‌స్తాడ‌ని చంద్ర‌బాబు, ఇటు సినీరంగంలో […]

త‌మిళ‌నాట షాక్‌:  దీప ఓ పార్టీ, దీప భ‌ర్త మ‌రో పార్టీ

త‌మిళ‌నాట మ‌రో సంచ‌ల‌నం! దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌మాధి.. ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఊహించ‌ని ప‌రిణామాల‌తో రోజుకో మలుపు తిరుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త ట్విస్ట్‌! అమ్మ వార‌సురాలిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె మేన‌కోడ‌లు దీపకు అనుకోని వ్య‌క్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది. దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇప్ప‌టికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయ‌గా.. ఇప్పుడు ఆమె భ‌ర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం […]