స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బ‌య‌ట‌ప‌డే య‌త్నం

ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు బాబు ప్రయ‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో దీనిపై కేసు న‌డుస్తుండ‌గానే ఈ టెండ‌ర్ విధానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంగ‌ళ‌వారం జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించాల‌ని చూస్తున్నారు. అయితే, ఒక ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తం అనే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది […]

కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌!

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌ని కంకణం క‌ట్టుకుని త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత‌, కేసీఆర్‌కు అనూహ్య ప‌రిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభ‌జించాల‌ని అప్పుడు పాల‌న ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ అవుతుంద‌ని ప‌క్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా త‌న కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌రీంన‌గ‌ర్ జిల్లాకు […]

చూస్తే తప్పు కాదు, చేస్తేనే తప్పు.

పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అయితే అది నిన్నటి మాట. కొత్త మాట ఏంటంటే పైరసీ సినిమాలు చూడచ్చు. ఆన్‌లైన్‌ పైరసీకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముంబై హైకోర్టు సంచలన తీర్పులో ఈ విషయం వెల్లడించింది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా పైరసీకి పాల్పడరాదని, అలా చేస్తే తీవ్రమైన నేరం కిందనే పరిగణించవలసి ఉంటుందని హైకోర్టు స్పష్టతనిచ్చింది. సినిమాకి పైరసీ అనేది పెనుభూతంగా మారింది. సినిమా విడుదలైన మరుక్షణం అది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఒక్కోసారి సినిమా విడుదలకు […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]

కెసిఆర్ కి హైకోర్ట్ లో మళ్ళీ పేలింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.  భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం కాకుండా 123 జీవో ప్ర‌కారం ప్రభుత్వం నేరుగా భూముల‌ను సేక‌రిస్తోందంటూ, దీని […]

ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!

అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్‌ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్‌, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు […]

కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!

ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]