నెల్లూరు వైసీపీలో కలకలం..కోటంరెడ్డి కూడా అవుట్?

కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వంపై విరుచుకుపడే పరిస్తితి. సరిగ్గా నిధులు అందకపోవడం, అధికారులు అభివృద్ధి పనులకు సహకరించకపోవడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు..సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరి ఎక్కువగా ఫైర్ అయిన ఆనంకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి […]

సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?

అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టి‌డి‌పి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]

సీఐడీ డీజీ బ‌దిలీ వెనుక వైసీపీలో ఒక్క‌టే గుస‌గుస‌లు…!

సీఐడీ డీజీ.. ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్‌ను అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌ట త‌ప్పించా రు. అయితే.. ఆయ‌న‌ను ఎందుకు ఆ పోస్టు నుంచి త‌ప్పించారు? అనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న గానే మిగిలిపోయింది. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌నున్నార‌ని కూడా కొంద‌రు పేర్కొన్నారు. అయితే.. దీనికి మ‌రో కార‌ణం.. మౌలిక‌, కీల‌క కార‌ణంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. ఒక‌టి.. […]

గుంటూరు మంత్రులు డేంజర్ జోన్‌లో..ముగ్గురికి చెక్?

అధికార వైసీపీలో మంత్రుల పాత్ర అభివృద్ధి చేయడం కంటే..ప్రతిపక్ష నాయకులని తిట్టడమే ఎక్కువనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏ మంత్రి అయినా ప్రెస్ పెడితే..వారి శాఖలకు సంబంధించి మాట్లాడటం తక్కువగా కనిపిస్తోంది..ఎంతసేపు ప్రతిపక్ష నేతలని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెట్టడమే అన్నట్లు ఉంది. అసలు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి పనుల గురించి మాట్లాడటం కనిపించడం లేదు. దీంతో మంత్రులు ఏ శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. దీని వల్ల […]

తాడేపల్లిగూడెంలో ట్విస్ట్..సీటుపై టీడీపీ-జనసేన పట్టు!

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక అధికారికంగానే పొత్తుపై ప్రకటన రావాలి. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టి‌డి‌పి ఇవ్వాలి. ఇదే సమయంలో ఆల్రెడీ కొన్ని సీట్లని జనసేన కోసం టి‌డి‌పి కేటాయించడానికి రెడీ అయిందనే ప్రచారం ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా మూడు సీట్లు మాత్రం జనసేనకు […]

తునిపై దాడిశెట్టి పట్టు..యనమల ఫ్యామిలీకి చిక్కులే!

2009 ముందు వరకు యనమల ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గం ఇప్పుడు దాడిశెట్టి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. 1983 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు యనమల రామకృష్ణుడు టి‌డి‌పి తరుపున తునిలో సత్తా చాటారు. 2009లో ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల బరిలో తప్పుకుని తన సోదరుడు యనమల కృష్ణుడుకు సీటు ఇచ్చారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు. వరుసగా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. […]

ఐప్యాక్‌ సర్వేతో టెన్షన్..క్లారిటీ వచ్చినట్లే.!

అధికార వైసీపీకి సర్వేల టెన్షన్ పెరిగిపోయింది..ఇటీవల బయటకొచ్చే ప్రతి సర్వే కూడా వైసీపీకి నెగిటివ్ గానే ఉంటుంది. వైసీపీ బలం ఎక్కువ తగ్గిందని, చాలా సీట్లు కోల్పోయిందని సర్వేల్లో వస్తుంది. ఇదే క్రమంలో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్ సర్వే కూడా బయటకొచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా మంత్రులు, మాజీ మంత్రులకు సంబంధించిన సర్వే వెలువడింది. ఇక దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు […]

యువగళం జోరు..టీడీపీకి కొత్త ఊపు.!

ఎట్టకేలకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టి‌డి‌పి నేతలు, శ్రేణులు పాదయాత్రలో పాల్గొని సక్సెస్ చేశారు. అటు లోకేష్ ప్రజలని కలుసుకుంటూ ముందుకెళ్లారు. పాదయాత్రలో బాలయ్య, తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు రావడంతో..ఆయన్ని కుప్పం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి వైద్యులని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లే తెలుస్తోంది. హాస్పిటల్ వద్ద బాలయ్య ఉండి మొత్తం చూసుకుంటున్నారు. […]

కొడాలికి ఎదురులేనట్లేనా..గుడివాడలో టీడీపీకి డౌటే?

గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గెలుపు అవకాశాలు కనిపించడం లేదా? ఈ సారి కూడా కొడాలి నాని సత్తా చాటడం ఖాయమేనా? ప్రస్తుతం గుడివాడలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఈ సారి కొడాలి గెలుపు మాత్రం అంత సులువు కాదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈజీగా కొడాలి గెలవడం కష్టమే. కాకపోతే ఇప్పటికీ గుడివాడలో కొడాలి లీడ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ ఆధిక్యాన్ని తగ్గించగలిగితేనే..గుడివాడలో టి‌డి‌పి గెలవగలదు. ఈ మధ్య వచ్చిన […]