అఖిల్‌ సినిమాకి నిర్మాత ఎవరంటే!

అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్‌ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్‌ పక్కన హీరోయిన్లుగా మెహరీన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌నే చేసినా […]

మోడీ తెలంగాణ టూర్‌ – టిటిడిపి దిగులు 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న ప్రాంతాలపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయి, ప్రధాని టూర్‌పై చర్చించాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తారు. మిషన్‌ భగీరధ ఇందులో ముఖ్యమైనది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మొదటి నుంచీ సమర్ధిస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. దాంతో తెలంగాణలో నరేంద్రమోడీ టూర్‌ గురించి తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి ఆందోళన […]

చంద్రబాబు సాధించుకొచ్చేస్తారట!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నేడు ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. ఇంకో వైపున రేపు రాజ్యసభలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్‌ జరిగితే బిల్లు పాస్‌ అయిపోతుంది. ప్రత్యేక హోదా కోరుతూ పెట్టిన బిల్లు ఇది. దాన్ని […]

జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని […]

కోహ్లీ అప్పుడలా ఇప్పుడిలా!

ఎంతటి  ఉన్నత స్థాయి వారికైనా కొన్ని నెరవేరని కోరికలు ఉంటాయి.  అవి సాకారం అయితే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటి  కోరిక  ఒకటి ఉండేది. ఒకప్పటి క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను చూస్తే చాలనుకునేవాడట. విరాట్‌ 10 ఏళ్ల క్రితం తోటి క్రికెటర్లతో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నారు. ఫొటోలో విరాట్‌ కెమెరా వైపు చూడకుండా రాహుల్‌నే చూస్తున్నాడు. […]

మోహన్ లాల్ కోసం బాహుబలి బ్రేక్

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. జక్కన్నతో పాటూ నటీనటులూ ఈ రిలాక్సేషన్ టైమ్ ను ‘మనమంతా’ కోసం స్పెండ్ చేయనున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిన్నటితరం హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 5న మూడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి తమ […]

పవర్ స్టార్ కీ ఓ సెంటిమెంట్ వుంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఈ నెల 6 నుండి మొదలవుతున్న సంగతి తెలిసిందే. గోపాల గోపాల ఫేమ్ డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఇదిలా ఉంటే, ఈ చిత్రం షూటింగ్ శనివారం నుంచే ప్రారంభమైపోతోంది. అయితే.. పవన్ మాత్రం చిత్రీకరణకు దూరంగా ఉంటారట. సెంటిమెంటో ఏమో కానీ.. సాధారణంగా పవన్ కల్యాణ్.. తన కొత్త చిత్రం ప్రారంభమైన వారంరోజుల తరువాతే షూటింగులో పాల్గొంటారని సన్నిహితులు అంటున్నారు. మొదటి […]

బన్నీ పార్టీ మాస్..ఊర మాస్..

అల్లు అర్జున్ నటించిన సరైనోడు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులందరికీ అల్లు అర్జున్ మాంచి పార్టీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ సందర్భంలో స్టైలిష్ స్టార్ నోటి వెంట వచ్చినమాట..మాస్ ఊర మాస్. అదే డైలాగ్ ను పార్టీకి క్యాప్షన్ గా పెట్టేశాడు అర్జున్. పేరు తగ్గట్టుగానే పార్టీలో అరేంజ్ మెంట్స్ ను అదరగొట్టేశారట. రెండు […]

జీఎస్టీ ఎఫెక్ట్:తెలంగాణా నష్టం ఎంతో తెలుసా

అనుకున్నట్టే జీఎస్టీ బిల్లు రాజ్య సభలో ఏ అడ్డంకులు లేకుండానే పాస్ అయిపొయింది.అయితే ఇక్కడ ఈ బిల్లు ఎఫెక్ట్ వేరే రాష్ట్రాలపై ఎలా వున్నా హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం ఈ బిల్లుతో ఏటా భారీగా నష్టపోనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది.ఓ వైపు కేంద్రం ఐదేళ్లపాటు రాష్ట్రాలకొచ్చే నష్టాన్ని మేమె భరిస్తామని […]