ఈ సారి 1st తెలంగాణ నెక్స్ట్ ఏపీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్ లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో […]

ఎంసెట్ ప్రకంపనలు-ఆ ఇద్దరు అవుట్!

ఎంసెట్-2 లీకేజీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టించబోతున్నది. విద్యార్థుల బంగారు భవి ష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విష యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సం బంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో, అటు విపక్షాల నుంచి ప్రభు త్వం తీవ్ర […]

ప్రీ రిలీజ్ ‘బంగారం’ వెంకీ రికార్డు!

కొన్నేళ్లగా  సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ ఇమేజ్ దెబ్బ తింది. కుర్ర హీరోల జోరు మధ్య ఆయన హవా తగ్గిపోయింది. వేరే హీరోలతో తెర పంచుకుంటూ సోలో హీరోగా వెనకబడిపోయాడు వెంకీ. ఆయన మార్కెట్ కూడా దెబ్బ తింది. దృశ్యం సినిమా బాగా ఆడినా సరే.. దానికి పెద్దగా బిజినెస్ జరగలేదు. లాభాలు కూడా భారీగా ఏమీ రాలేదు. ఐతే బాబు బంగారం సినిమాతో వెంకీ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ కెరీర్ లోనే […]

‘చెప్పను బ్రదర్’ కి కౌంటర్ అరవండి బ్రదర్

మెగా హీరోల సినిమా ఫంక్షన్ అయినా,ఫామిలీ ఫంక్షన్ అయినా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోతే అభిమానులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించేస్తున్నారు.అయితే ఈ అభిమానం అప్పుడప్పుడు మెగా ఫామిలీ వాళ్ళకే ఇబ్బంది కలిగిస్తోంది. ఆ మధ్యన మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఈ విషయం పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.తాజాగా అల్లు అర్జున్ కూడా అభిమానులపై అసహనం వ్యక్తం చేసాడు.పవన్ గురించి మాట్లాడమన్న ఓ అభ్యర్ధనకు […]

థమన్ కి మెగా బూస్ట్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మధ్య అవకాశాలు తగ్గి రేస్ లో వెనుకబడ్డాడు.అదే టైం లో తన తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా దేవి శ్రీ ప్రసాద్,అనూప్ రూబెన్స్,మిక్కీ జ్ మేయర్ లాంటి యువ సంగీత దర్శకులు దూసుకుపోతున్నారు.సరిగ్గా ఇలాంటి టైం లో జరిగిన అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో వేడుక థమన్ కి బూస్ట్ నిచ్చించి. ఇంతకీ విషయమేంటంటే ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ రావడం..థమన్ ని పొగడతలతో ముంచెత్తడం జరిగింది.అల్లు […]

సిఎం కుమారుడి మృతి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య (39) అనారోగ్యంతో మరణించారు. బెల్జియంలోని అంట్వెర్ప్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు అయన చికిత్స కోసం చేరారు. గతంలో రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవలే రాకేష్ తన రాజకీయ ఎంట్రీ మీద వ్యాఖ్యలు చేసారు. తన […]

పదవి పోయినా డోన్ట్‌ కేర్‌: కేశినేని

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]

మెసేజ్‌ అదిరిందయ్యా నానీ

యంగ్‌ హీరో, నేచురుల్‌ స్టార్‌ నాని ‘మజ్ఞు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి క్యాప్షనేంటో తెలుసా? ‘స్టాప్‌ డ్రింకింగ్‌.. స్టార్ట్‌ లవింగ్‌’. తాగుడు మానండి, ప్రేమించడం మొదలు పెట్టండి అని ఎంతో చక్కటి మెసేజ్‌ ఇస్తున్నాడు నాని. యంగ్‌ హీరోల్లో నాని డిఫరెంట్‌. సహజత్వం కోసం ఆరాటపడుతుంటాడు. చేసే సినిమాలన్నీ అలాంటివే. ఏ సినిమా చేసినా అందులో సహజత్వం కోసం, కొత్తదనం కోసం నాని పడే తపన అంతా ఇంతా కాదు. నాని నటిస్తాడు అని […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]