సైలెంట్‌గా ‘ సొంగా రోష‌న్‌ ‘ రాజ‌కీయం… అంతుచిక్క‌ని టెక్నిక్‌…!

పార్టీకి కంచుకోట‌… గ‌త ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల‌తో పార్టీ ఓట‌మి.. పైగా నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్ కూడా లేరు… పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగానే ఉంది… స‌మ‌ర్థులు, సీనియ‌ర్లు అయిన నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ ఎవ‌రు ? ఎవ‌రు పోటీలో ఉంటారు ? అన్న‌ది తెలియ‌క చింత‌ల‌పూడి కేడ‌ర్‌, పార్టీ వీరాభిమానులు మూడేళ్ల‌గా పైగా అనుభ‌విస్తోన్న ఉత్కంఠ మామూలుగా లేదు. అస‌లే ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది.. అటు వైసీపీ క్యాండెట్ డిసైడ్ అయిపోయాడు… సిట్టింగ్ ఎమ్మెల్యేను ప‌క్క‌న పెట్టి కొత్త క్యాండెట్‌ను దించారు.

అటు చూస్తే వైసీపీ క్యాండెట్ ఎనౌన్స్ మెంట్‌తో ఆ పార్టీ కేడ‌ర్‌లో ఒక్క‌టే జోష్‌… ఇటు చూస్తే టీడీపీకి ఇంకా క్యాండెట్ ఎవ‌రో తెలియ‌దు.. కేడ‌ర్ నిస్తేజంగా ఉంది. మ‌న క్యాండెట్ ఎవ‌రు ? అన్న‌ది క్లారిటీ లేక.. ఎటు వెళ్లాలో తెలియ‌క‌.. ఇటు గ్రూపుల గోల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న చింత‌ల‌పూడి టీడీపీకి ఇప్పుడు సొంగా రోష‌న్‌కుమార్ రూపంలో కొత్త యంగ్ లీడ‌ర్ దొరికేశాడు. పార్టీ అధిష్టానం ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా రోష‌న్ పేరు ఖ‌రారు చేసింది.

రోష‌న్ పేరు అలా ఎనౌన్స్ అయ్యిందో లేదో వెంట‌నే చింత‌ల‌పూడి టీడీపీ కేడ‌ర్‌లో జోష్ మామూలుగా లేదు. కేవ‌లం రెండు రోజుల్లోనే నియోజ‌క‌వ‌ర్గ కేడ‌ర్‌, ప్ర‌ధాన నాయ‌కుల్లోకి రోష‌న్ పేరు వెళ్లిపోవ‌డం.. ఇటు రోష‌న్ కూడా తొలి రోజే యాత్ర‌తో గుళ్లు తిరుగుతూ మెయిన్ కేడ‌ర్ మొత్తం క‌వ‌ర్ అయ్యేలా చేసిన ప్రోగ్రామ్ బాగా స‌క్సెస్ అయ్యింది. త‌న స్వ‌గ్రామం అయిన లింగ‌పాలెం మండ‌లం ధ‌ర్మాజీగూడెం నుంచి రంగాపురం స‌త్య‌నారాయ‌ణ స్వామి టెంపుల్‌.. మ‌ద్ది వ‌ర‌కు చేప‌ట్టిన యాత్ర‌తోనే కేడ‌ర్‌లో ఒక్క‌సారిగా నూత‌న ఉత్సాహం వ‌చ్చేసింది.

నిన్న‌టి వ‌ర‌కు లీడ‌ర్ లేడ‌ని నిట్టూర్చిన చింత‌ల‌పూడి టీడీపీ కేడ‌ర్ రెండు రోజుల్లోనే రోష‌న్ నాయ‌క‌త్వాన్ని స్వాగ‌తిస్తూ ఎక్క‌డిక‌క్క‌డ స్వాగ‌తాలు ప‌ల‌క‌డం.. ఆయ‌న్ను క‌లిసేందుకు ఆస‌క్తి చూప‌డం.. ఫ్లెక్సీలు క‌ట్ట‌డంతో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో ఏ గ్రామంలో చూసినా టీడీపీ కేడ‌ర్ దూకుడు అయితే మామూలుగా లేదు. వాస్త‌వానికి నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపులు ఉండ‌డంతో రోష‌న్ వీరిని ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుంటాడ‌న్న చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. వాటిని ప‌టాపంచ‌లు చేస్తూ ప్ర‌తి నాయ‌కుడి ద‌గ్గ‌ర‌కు వెళుతున్నారు.

వ‌య‌స్సులో త‌న‌క‌న్నా పెద్ద నేత‌లు, సీనియ‌ర్ల కాళ్ల‌కు మొక్కి కూడా త‌నను ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నారు. ఎన్నారై కావ‌డంతో పాటు తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌డంతో కేడ‌ర్‌, లీడ‌ర్ల‌తో ఎలా మ‌మేక‌మ‌వుతార‌న్న సందేహాలు కూడా రెండు రోజుల్లోనే తొలిగిపోయాయి. ఎన్నారై అయినా కూడా ఏపీలో ఉన్న ప్ర‌స్తుత రాజ‌కీయాలు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ.. ఇటు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న‌తో ముందుకు వెళుతుండ‌డం కూడా పార్టీ కేడ‌ర్‌లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎన్నారై అయినా మొత్తానికి త‌న‌దైన సైలెంట్ రాజ‌కీయంగా ప‌క్కా లోక‌ల్‌నే అన్న‌ట్టుగా రోష‌న్ దూసుకు పోతున్నారు.