పుష్ప2 లో శ్రీవల్లి పాత్ర అలా ఉండబోతుందా…? సుకుమార్ పెద్ద తప్పే చేస్తున్నాడే..!!

ప్రజెంట్.. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పవన్ సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 రాబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని కేటాయించారు మేకర్స్ .

అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ మరింత వైలెంట్ గా కనిపించబోతున్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించబోతుంది . పుష్పవన్ లో శ్రీవల్లి పాత్ర ఎలా ఉందో మనం చూసాం. డి గ్లామరస్ లుక్ . అయితే పుష్ప2 లో మాత్రం శ్రీవల్లి ఓ రేంజ్ లో అల్లాడించేస్తుందట . మరీ ముఖ్యంగా పుష్ప2 లో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవుతుందని.. ఆ తర్వాత మంగళం సీనుతో జరిగే దాడుల్లో ఆమె చనిపోతుంది అని..

తెరపై మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అవుతుంది అని .. ఓ న్యూస్ లీకై వైరల్ గా మారింది . అయితే శ్రీవల్లి పాత్రను చంపేస్తే పుష్ప గాడు సింగిల్ గా కథను మొత్తం ఎలా నెట్టు కొస్తాడు ..? కచ్చితంగా శ్రీవల్లి పాత్ర చనిపోతే ఆ ప్లేస్లో మరో హీరోయిన్ ఉండాలి .. అప్పుడే సినిమా మరింత హిట్ అవుతుంది .. లేకపోతే బన్ని సీన్స్ పెట్టినా .. ఎన్ని కోట్లు పెట్టినా.. మూవీ చప్పగా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. శ్రీవల్లి విషయంలో సుకుమార్ పెద్ద తప్పే చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు…!!