లలిత్ మోది తో సంబంధం పైన షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మితాసేన్..!!

మాజీ విశ్వసుందరిగా పేరుపొందిన సుస్మితసేన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో రోహమాన్ షాల్ అనే మోడల్ తో ప్రేమాయణం నడిపి అతనితో బ్రేకప్ చెప్పి కొంతకాలం తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో డేటింగ్ చేస్తోందని ప్రకటించి ఒకసారిగా షాక్ ఇచ్చింది. కానీ ఈ ఇద్దరు ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవలేక పోయిందట. ఇటీవలే ఈమె లలిత్ మోడీతో కలిసి ఉన్న సంబంధాన్ని సైతం తెలియజేసినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె లలిత్ మోడీతో తనకు సంబంధాల స్థితి గురించి డైరెక్ట్ గా మాట్లాడకపోయినా తాను వివాహం చేసుకోలేదని విషయాన్ని తెలియజేసింది.తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును ఉంచాను ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మౌనాన్ని సైతం బలహీనంగా లేకపోతే భయంగా తప్పుగా కూడా భావిస్తారు నేను వారి ఉద్దేశాలను సైతం అప్పుడప్పుడు నవ్వుకుంటానని తెలిపారు.

తాను ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే కచ్చితంగా చేసుకుంటానని తెలియజేసింది.గత ఏడాది ప్రారంభంలో బిజినెస్ లలిత మోడీ సుష్మితాసేన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో పెను దుమారాన్ని సృష్టించాయి.అయితే వీరిద్దరికి ఇంకా వివాహం కాలేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ రోహమన్ తో కలిసి దీపావళి పార్టీలో కనిపించడం జరిగింది. రోహమన్ తో కూడా డేటింగ్ చేసి కలతతో విడిపోయిన ఈమె తిరిగి మళ్లీ అతని దగ్గరికి చేరినట్లు సమాచారం. రోమన్ తనకంటే 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న కుర్రాడని తెలుస్తోంది.