దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవలే లియో సినిమాలో కనిపించి మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇటీవల హీరోయిన్ త్రిష పైన పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు , అభిమానులు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా త్రిష పైన రేప్ వాక్యాల పైన క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ తన మాటలను తప్పుగా చూపించారని చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. నటి త్రిష మెచ్చుకోవాలని ఉద్దేశంతోనే తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో తెలిపారు.. త్రిష తన పాత్రను ఒక హనుమంతుడితో పోల్చారు ..సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం ఆమెకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.. కానీ దురదృష్టవశాత్తు ఆ స్టేట్మెంట్ తీసివేయడం జరిగింది. కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే అక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలని వైరల్ గా చేశారని తెలిపారు మన్సూర్ అలీ ఖాన్.
త్రిష ఫై తనకు మంచి అభిప్రాయం ఉందని ఆమెను గౌరవిస్తానని సరదాగా చెప్పిన వాక్యాల పైన ఇలాంటి దుమారం చేస్తారనుకోలేదు.. తాను ఎవరినో ఎలాంటి వాడిని అందరికీ తెలుసు అంటూ తమిళంలో ఒక పోస్టు రాసుకొచ్చారు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నాందుకు తప్పుగా చూపించి తన పైన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.. తన సినిమాల పైన ప్రభావం చూపించేందుకే ఇలా చేస్తున్నారని స్త్రీల పట్ల తనకు చాలా గౌరవం ఉందని గతంలో తాను ఎంతో మంది నటీనటులతో పని చేశాను నేను ఎవరితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టు వైరల్ గా మారుతోంది.
View this post on Instagram