దేవర సినిమా షూటింగ్లో హీరో శ్రీకాంత్ కి ప్రమాదం..!!

గతంలో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీకాంత్ ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా ట్రై చేసిన సక్సెస్ కాలేకపోయారు. అఖండ సినిమాతో సక్సెస్ కాలేదు. దీంతో పలు చిత్రాలలో సపోర్టింగ్ రూల్స్ లోనే నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు.
తాజాగా కోటబొమ్మాలి అనే చిత్రంలో శ్రీకాంత్ మెయిన్ రోల్లో నటిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో  శ్రీకాంత్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఈ షోలో ఏ ఒక్క ఎపిసోడ్ కూడా ఇంతవరకు మిస్ కాలేదని ఈ ఏడు సీజన్లలో ఏ ఒక్క ఎపిసోడ్ సైతం మిస్ కాలేదని తెలియజేశారు.అయితే అదే స్టేజి మీద శ్రీకాంత్ కి కాలికి ఉన్న కట్టు గురించి నాగార్జున అడగగా. వాటి గురించి అసలు విషయాన్ని తెలిపారు.

గోవాలో దేవర సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఇసుక దిబ్బలలో పరిగెడుతూ ఉంటే కాలు బెణికిందని తెలియజేశారు. చిన్న గాయమే కదా అని షూటింగ్ చేస్తూనే వచ్చారట. అయితే ఆ తర్వాత అది వాపు ఎక్కువగా పెరిగిపోయిందని దీంతో వైద్యుల వద్దకు వెళితే కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పారట. అయినా కూడా షూటింగ్ చేశానని నిలబడే డైలాగులు చెప్పానని తెలియజేశారు శ్రీకాంత్.. అయితే ఈ గాయం తారక్ వల్ల కాలేదు అంటూ నవ్వుతూ సమాధానాన్ని తెలిపారు శ్రీకాంత్ దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే..