OG సినిమాపై అలాంటి వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో OG సినిమా కూడా ఒకటి..ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి వివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతూ ఉన్నది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రం ముంబైలో సాగే గ్యాంగ్స్టర్ కథ అన్నట్లుగా తెలుస్తోంది.

ఇదివరకే మేకర్స్ సైతం పలు రకాల అప్డేట్లను ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కోలీవుడ్ బాలీవుడ్ స్టార్ నటీనటుల సైతం ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా పైన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి పలు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 60 శాతం వరకు టాకీ పార్టును పూర్తిచేసుకుందని తెలిపారు. ఇటీవలే ముంబై షెడ్యూల్లో ఆయనకు సంబంధించి సినిమా షూటింగ్ విషయంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హస్మీ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నాయని దీంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. Og సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉండడమే కాకుండా కూల్ గా సాగిపోతుందని తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుంచి గతంలో విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్ మేకవర్ అంతా కూడా చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు.