నమ్మి మోసపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన ఈమె ఎన్నో చిత్రాలలో పలు రకాల పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించింది సింగర్ సునీత అయితే సింగర్ సునీత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి.. 17 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న తర్వాత విభేదాలు రావడంతో విడిపోవడం జరిగింది.

అయితే ఆ తర్వాత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని 42 ఏళ్ళ వయసులో రెండో వివాహం చేసుకొని విమర్శలకు దారితీసేలా చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సునీత తన జీవితం లో ఎదురైన కొన్ని కష్టాలను సైతం తెలియజేసింది సునీత మాట్లాడుతూ.. జీవితంలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం మనం ఎలా ఎదుర్కొన్నామనేది ముఖ్యము.. తన లైఫ్ లో జరిగిన విషయాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. ఆరోజు నువ్వు ఏడుస్తుంటే చాలా బాధేసిందని గుర్తుచేసినప్పుడల్లా చాలా ఏడ్చాను అంటూ తెలిపింది.

నేను ఎన్నో విషయాలలో మోసపోయాను నాపై వచ్చిన విమర్శలు లెక్కలేనివి 17 ఏళ్లకే కెరియర్ ని మొదలుపెట్టాను 19 ఏళ్లకే వివాహం సంపాదన బాధ్యతలు తీసుకున్నాను 20 ఏళ్ల కే కొడుకు 24 ఏళ్లకే కూతురు పుట్టింది.. ఇక తన తండ్రి కూడా వ్యాపారంలో నష్టపోయారు ఇల్లు కూడా పోయింది 35 ఏళ్లు వచ్చేసరికి చాలా కష్టపడ్డాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డానని తన చుట్టూ ఉన్నవాళ్లే తనని మోసం చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపింది. నేను తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం అంటే రెండో వివాహమే అని సింగర్ సునీత తెలిపింది.