వెహికల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి..!!

ప్రముఖ చైనా కంపెనీ చెందిన షావోమి మొబైల్స్ అత్యధికంగా చౌక ధరకే తమ కస్టమర్లకు అందించే విధంగా ఉంటుంది.. అంతేకాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ వస్తువులలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇంటి సామాగ్రికి సంబంధించిన వాటిలో కూడా ఇంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి కూడా షావోమి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.SU -7 సెడాన్ పేరుతో ఒక ఈవీ కారుని మూడు వేరియంట్ లో తీసుకురాబోతోంది ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


XIAOMI SU -7 SEDANLANCH:
ఈ వెహికల్ ఏడాది డిసెంబర్లో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సెడాన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుందట. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఎంచుకోవడం కోసం వినియోగదారులకు రెండు ఆప్షన్స్ సైతం అందిస్తుంది.. అందులో రియర్ వీల్ డ్రైవ్..(RWD), మరొకటి ఆల్ వీల్ డ్రైవ్..(AWD) ఎలక్ట్రిక్ సెడా విడుదల తరువాత మూడు విభిన్నమైన వేరియంట్లలో ఉండబోతుందట.. ఇందులో SU -7,SU -7 PRO ,SU -7 MAX గా ఉండబోతున్నాయట.

ఆర్డబ్ల్యుడి వేరియంట్లో సింగిల్ ఎలక్ట్రానిక్ మోటార్..295GHP నువ్వు సైతం పవర్ ను ఉత్పత్తి చేస్తాయట. AWD వర్షన్ లో 663 GHP పవర్ను అందిస్తాయట.. ఇందులో పెద్ద బ్యాటరీలను అమర్చడంతో ఈ ఎలక్ట్రిక్ కార్లు భారీగానే ఉంటాయని ఆ సంస్థ తెలియజేస్తోంది.. ముఖ్యంగా SU -7 బేసిక్ మోడల్ కారు 1,980.. టాప్ ఎండ్ కారు 2,205 కిలోల బరువులు ఉంటాయట. 210 కిలోమీటర్లు గరిష్ట వేగానికి వెళుతుంది హైవేరియంటెడ్ కార్లు అయితే 270 కిలోమీటర్లు ప్రయాణిస్తాయట.

 

అయితే ఈ కార్ల ఉత్పత్తిని డిసెంబర్ నెలలో ఏడాది ప్రారంభించగా డెలివరీ మాత్రం ఫిబ్రవరి వచ్చేయేడాదిలో చేయబోతున్నాయట. ఇప్పటికే ఫ్యాక్టరీలో ట్రయల్ ఉత్పత్తిని కూడా ప్రారంభించామని తెలుపుతున్నారు. చూడడానికి చాలా స్టైలిష్ గా అట్రాక్షన్ గా కనిపిస్తోంది ఈ షావోమి కారు.. మరి ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.