ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది.

ఎన్టీఆర్ మృదు స్వభావి అని, పెద్దల పట్ల గౌరవం ఉన్న వ్యక్తని, స్త్రీలను ఎంతగానో గౌరవిస్తాడని ఎప్పుడు ఆనోటా, ఈనోటా వింటూనే ఉంటాం. అభిమానుల దగ్గర నుంచి, సినీ తారల వరకు, అందరు ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తారు. ఆయన కూడా అభిమానులతోను, జూనియర్ ఆర్టిస్ట్ లతోను ఎంతో సరదాగా కలిసిపోతారు. తోటి నటులు, హీరోలతో కూడా సోదర భావంతో మెలుగుతారు. ఎన్టీఆర్ కు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా అందరికి తెలిసినదే. ఇద్దరూ ఒకరినొకరు బావా అని పలకరించుకుంటారు. ఐతే ఎన్టీఆర్ కి అల్లు కుటుంబంతో ఉన్న బంధం ఎటువంటిదో మరోసారి రుజవయింది. అల్లు అర్జున్ సోదరుడు, ప్రముఖ హీరో అల్లు శిరీష్ తాజాగా ట్విట్టర్ లో ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీపావళి సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి గారు తన ఇంటి వద్ద తెలుగు పరిశ్రమ ప్రముఖులకు ఒక పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ లు కూడా హాజరయ్యారు. ఐతే అల్లు శిరీష్ ఈ పార్టీలో ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “అభిమానులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్…అన్న తేడా లేకుండా, ఎవరు ఫోటో అడిగిన ఆయన స్పందన ఒకేలా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు శిరీశ్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.