ఈ ఐదు మంది స్టార్ హీరోల 25వ సినిమా ఏంటో తెలుసా… వాటి ఫలితాలు ఇవే…!!

25, 50, 100 ఇవి చెప్పుకోవడానికి నెంబర్సే అయినప్పటికీ.. కొంతమంది లైఫ్ లో చాలా ముఖ్యమైన నెంబర్స్ గా మిగిలిపోతాయి. క్రికెట్లో కావచ్చు మరి ఏదైనా సమయంలో కావచ్చు. సినిమా వాళ్లకి కూడా ఇది ఓ ప్రత్యేకమైన నెంబర్. ప్రముఖ హీరోల కి ఇది ఓ ల్యాండ్ మార్క్ నెంబర్ లాంటిది. ప్రస్తుతం మనం 25 గురించి చెప్పుకుందాం. ఈరోజులలో హీరోలు 25 సినిమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా 25వ సినిమా అంటే ల్యాండ్ మార్క్. దానికి రీచ్ అవ్వడమే చాలా కష్టమైన పని. మరి అలాంటి ల్యాండ్ మార్క్ మూవీస్ తో కొంతమంది స్టార్స్ ఎలాంటి ఫలితాలు దక్కించుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్:


త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ” అజ్ఞాతవాసి “. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఇది పవన్ కళ్యాణ్ కి 25వ సినిమా కావడంతో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. కానీ అంచనాలను మార్క్ చేయలేకపోయింది ఈ సినిమా.

2 ఎన్టీఆర్:


ఎన్టీఆర్ 25వ సినిమాగా ” నాన్నకు ప్రేమతో ” రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన టిపికల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ ని అందుకుంది.

3. మహేష్ బాబు:


మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మూవీ ” మహర్షి “. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది.

4. సూర్య:


సూర్య హీరోగా తెరకెక్కిన మూవీ ” సింగం”. సూర్యకి ఇది 25వ సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

5. రవితేజ:


మాస్ మహారాజ్ హీరోగా నటించిన 25వ సినిమా ” కిక్ “. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది.

ఇలా తమ 25వ సినిమా తో కొంతమంది బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటే… మరికొందరు మాత్రం ఫ్లాప్ లని అందుకున్నారు. ఇదంతా పక్కన పెడితే… 25 సినిమాలు తీస్తేనే వారు సక్సెస్ అయినట్లే లెక్క.