మొబైల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్ పడినట్టే..?

మొబైల్ యూజర్స్ కి సైతం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలుపుతోంది కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలోనే మొబైల్ ఉపయోగించేవారు కోసం ఒక నెంబర్ ని సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇండియాలో ఉపయోగించే వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ ఐడి కార్డు మాదిరిగాను ఒక ప్రత్యేకమైన ఐడి నెంబర్ను సైతం జారీ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా మోసాలు సైబర్ నేరగాళ్లు బారిన పడుతూనే ఉన్నారు.

Unique Customer ID For Mobile

అందుకే ఈ ప్రత్యేకమైన ఐడి తో మొబైల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఐడిని మొదలు పెట్టింది.. యూనిక్ ఐడి నెంబర్ యూజర్ల వద్ద ఎన్ని మొబైల్స్ ఉన్నాయి.. ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అందులో ఎన్ని యాక్టివేషన్ లో ఉన్నాయి అనే వాటి పైన వివరాలను సేకరిస్తూ ఈ సిస్టం మొబైల్ యూజర్ సమాచారాన్ని సైతం సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు పడే విధంగా ప్రభుత్వం ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్డు డిజిటల్ మెడికల్ రికార్డు లాంటిదని చెప్పవచ్చు.. ముఖ్యంగా అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు మన హెల్త్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఈ డిజిటల్ ఐడి కూడా అలాగే వర్క్ అవుతుందట.. స్పామ్ కాల్స్ డిజిటల్ మోసాలు పెరుగుదల ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకమైన మొబైల్ ఐడి నెంబర్ సిస్టంతో భద్రత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ యూనిక్ ఐడి నెంబర్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఫేక్ సిమ్ కార్డులు భారీగా కొనుగోలు చేసినట్లుగా గుర్తించడం తో ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రత్యేకమైన ఐడి నెంబర్ ని కలిగి ఉండడం వల్ల ఆ సిమ్ముని ట్రాక్ చేయడం చాలా సులువుగా మారుతుందట. అయితే ఇది కొత్తగా మొబైల్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే కొత్త సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు యూజర్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుందట.