కాల్ మాట్లాడే టైంలో లొకేషన్ దాచేయడానికి సహాయపడే కొత్త ఫీచర్ ని వాట్సాప్ తమ వినియోగదారులకు అందించింది. ఆ ఫీచర్ పేరు ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్. దీన్ని సెట్టింగ్స్ లో ఆప్షన్స్ ద్వారా యాక్సిస్ చేయవచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ కాల్ పిర్ టు పిర్ డైరెక్షన్ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. అలాంటి స్టేజిలో స్కామర్ లేదా హ్యాకర్స్ మీ ఫోన్ ఈజీగా హ్యాక్ చేయవచ్చు. లొకేషన్ కనుగొనవచ్చు. హ్యాకర్లు కూడా ఐపి అడ్రస్ సాయంతో మీ సెర్చ్ హిస్టరీ, షాపింగ్ మొదలైన పర్సనల్ విషయాలు కూడా స్వీకరించవచ్చు. కాగా న్యూ ఫీచర్‌తో మీ లొకేషన్ ను దాచిపెట్టడానికి మీ ప్రైవసిని కాపాడడానికి సహాయపడుతుంది.
ఈ కొత్త టీచర్ ను ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా వాట్సాప్ లోని సెట్టింగ్స్ కి వళ్లి ప్రైవసీలో అడ్వాన్స్డ్ ఆప్షన్ను తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ను ఆన్ చేయాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫీచర్ ని ఆన్ చేసిన తర్వాత వాట్స్అప్ కాల్స్ ఆలస్యం కావచ్చు. లేదా కాల్ క్వాలిటీ సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ని ఆన్ లో ఉంచిన తర్వాత మీకు కాల్ అంటూ ఎండ్‌టూ ఎండ్ డిస్క్రిప్ట్డ్ ఉంటుంది. అంటే కంపెనీ మీరు మాట్లాడుకునేది వినదన్నమాట. కొంతకాలం క్రితం కంపెనీ సైలెన్స్ కాల్స్ అనే ఫీచర్ను మొదలుపెట్టింది. ఈ ఫీచర్ ఆన్ లో ఉన్నప్పుడు తెలియని నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతున్నాయి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలగదు.
ఇక తాజాగా వాట్స్అప్ భారతదేశంలో 71 లక్షల పైగా ఖాతాలను బ్యాన్ చేసింది. దీనికి కారణం కంపెనీ కంప్లైంట్స్ రిపోర్ట్ అని వాట్సప్ అధినేతలో చెప్తున్నారు. భారతదేశంలో 50 కోట్ల మందికి పైగా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధమైన కొన్ని కార్యకలాపాలను అకౌంట్లో చేయడం వల్ల ఆ ఖాతాలను బ్యాన్ చేశారు. ఇంతకుముందు కూడా వాట్సప్ భారతదేశంతో సహా పలుదేశాల్లో అనేక ఖాతాలను నిషేధించారు. సెప్టెంబర్ లో భారత దేశంలో వాట్స్అప్ రికార్డ్ స్థాయి 10,452 ఫిర్యాదులను అందుకుంది. ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు అంటే ఈ ఖాతాలను బ్యాన్ లేదా రిస్టోర్ చేశారు.