సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హైపు కూడా భారీగానే పెరిగిపోతుంది. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేస్తొంది.
హీరోయిన్ గా శ్రీ లీల ,మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. దాదాపుగా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తూ ఉండటంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ధమ్ మసాలా బిర్యానీ అంటూ మాస్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. సంగీతాన్ని తమన్ అందించారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సినిమా థియేటర్లో దుమ్మురేగడం ఖాయమంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ చిన్నబాబు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ కూడా తెలుపుతున్నారు. దాదాపుగా చాలా ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమాలో మరొకసారి మహేష్ బాబు బీడీని కాల్చడం జరుగుతోంది.ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లు అయితే వైరల్ గా మారుతున్నాయి.