ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా కి సంబంధించి ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆకతాయిలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఈ వీడియో జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో పై పలువురు స్టార్ సెలబ్రెటీస్ స్పందిస్తూ రష్మిక మందన్నా కు సపోర్ట్ చేస్తున్నారు .
కాగా ఇలాంటి క్రమంలోని అభిమానులు కొందరు ఎవరైతే రష్మికకు సపోర్ట్ చేస్తున్నారో వారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు . ఇలాంటి వీడియోస్ లో ఇది కొత్త కాదు గతంలో ఎంతోమంది హీరోయిన్స్ ని కూడా ఇలాగే ఏడిపించారు . జాన్వి కపూర్ – త్రిష – నయనతార – కాజల్ అగర్వాల్ లాంటి ఎంతో మంది బడా హీరోయిన్స్ ని కూడా ఇలా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ కి సంబంధించిన ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
కానీ ఎందుకు రష్మిక మందన్నాని అందరూ సపోర్ట్ చేస్తున్నారు ..? రష్మిక మందనకి జరిగింది అన్యాయం అంటూ ఈ రేంజ్ లో ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ..? ఆమె ఒక్కటే ఇండస్ట్రీలో ఆడపిల్లనా..? మిగతా వాళ్ళు కాదా..? అందరికీ ఒకే న్యాయం ఉండాలిగా .. రష్మిక పట్ల జరిగింది నిజంగా అన్యాయమే.. అయితే అంతకుముందు హీరోయిన్స్ విషయంలో జరిగింది . మరి అప్పుడు ఎందుకు ఎవరు ఈ విధంగా సపోర్ట్ చేయలేదు ..? అంటూ మండిపడుతున్నారు..!!
రష్మిక ఒక్కటే ఆడదా..? మిగతా హీరోయిన్స్ ఫేక్ మార్ఫింగ్ వీడియోస్ అప్పుడు ఏం పికారు..?
