ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ని మోసం చేసిన కీర్తి సురేష్.. ఏం జరిగిందంటే.. ?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్‌.. నూను శైలజ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాన్ని అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు అందాల విందు చేసే ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ ని మోసం చేసిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏంటంటే కీర్తి సురేష్ – నాని జంట‌గా పాన్ ఇండియా మూవీ దసరా సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కథ చెప్పడానికి వెళ్లిన సమయంలో శ్రీకాంత్, కీర్తి సురేష్ కు మీరు ఈ కథ కోసం ఒక 10 కేజీలు వెయిట్ పెరగాలి అని చెప్పుకొచ్చాడట. మొదట మీరు కథ చెప్పండి అది నచ్చితే నేను కచ్చితంగా వెయిట్ పెరుగుతాను అంటూ కీర్తి సురేష్ చెప్పడంతో శ్రీకాంత్ కీర్తికి కథ వినిపించాడట. కథ బాగా నచ్చిన కీర్తి వెయిట్ రీజ‌నఃతో నో చెప్పడం ఇష్టం లేక ఓకే మీరు షూటింగ్ కి రెడీ చేసుకోండి అప్పట్లో గా నేను వెయిట్ పెరుగుతాను అంటూ చెప్పుకొచ్చిందట. కీర్తి సురేష్ మాటలు నమ్మిన శ్రీకాంత్ అలాగే షూటింగ్ కు అంత సిద్ధం చేశాడు.

తరువాత షూటింగ్స్ సెట్స్‌కు కీర్తి సురేష్ వెళ్ళంద‌ట‌. అయితే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళిన శ్రీకాంత్ ఆమె వెయిట్ చెక్ చేపించగా ఏమాత్రం వెయిట్ పెరగలేదట. దీంతో కోపం వచ్చిన శ్రీకాంత్.. నాని వద్దకు వెళ్లి సార్ మనం హీరోయిన్ ని మార్చేద్దాం ఆమెకు వెయిట్ పెరగమని చెప్పినా సరే కాస్త కూడా వెయిట్ పెరగలేదు. ఈ సినిమాకు కచ్చితంగా వెయిట్ పెరగాలి. దానికి ఓకే చెప్పి కూడా ఆమె చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడట. నాని మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ శ్రీకాంత్ తనొక నేషనల్ అవార్డు విన్నర్. ఒకసారి ఆమె నటనని చూడు తర్వాత కూడా నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పాడట. ఇక తర్వాత సెట్‌లో కీర్తి యాక్టింగ్ చూసిన శ్రీకాంత్ కు మైండ్ బ్లాక్ అయిపోయిందట. అంత బాగా కీర్తి సురేష్ ఈ సినిమాలో యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటి.