యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో అడవి శేష్ పై ఆసక్తికర విషయాలను తెలిపింది. అనసూయ మాట్లాడుతూ..” నేను అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు చేశాను. ఎంబీఏ చదివి హెచ్ ఆర్ గా పనిచేశాను. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. 2013లో నేను దేవీశ్రీ ప్రసాద్ తో పని చేశాను. ఆ టైంలో అడవి శేష్ కలిసాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని.. ఈ హీరోలంతా లైన్ వేయడానికి అప్రోచ్ అవుతారని అనిపించింది.
అందుకే అప్పుడు అడివి శేష్ ను బాగా అవాయిడ్ చేశా. ఓ మూడు నెలల తరువాత ఒక కాఫీ షాప్ లో మేమిద్దరం కలిసాము. అక్కడ కూర్చోబెట్టి మీకు సినిమా స్టోరీ చెబుదాం అనుకుంటున్నాం. మీరేమో మాకు అస్సలు దొరకడం లేదు అన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది. వాళ్లు సినిమాకు నా అవసరం ఉందని విషయం. జబర్దస్త్ లో నేను సీరియస్ గా కనిపించడం అడవి శేష్ చూసాడట. అందుకే ఆ పాత్రకు నేను సెట్ అవుతానని అనుకున్నాడట. అందువల్లనే అలా చేశాడు ” అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram