దీపావళి వచ్చేస్తుంది… అమ్మాయిలు మరి మీరు ఈ పని చేస్తున్నారా…!!

దీపావళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. చాలామంది పండగ పూట తమ అందాన్ని కెమెరాలలో బంధించేందుకు ఇష్టపడతారు. దుస్తులతో పాటు చర్మ సౌందర్యం పై కూడా దృష్టి పెడతారు. అలాంటి వారు ఈ వారం రోజులపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే పండగ రోజున మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఫేస్ వాష్:
ప్రతిరోజు ఉదయం తో పాటు రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మీ చర్మంపై ఉన్న దుమ్ము, దూళి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

2. వాటర్ తాగాలి:
చర్మాన్ని హైడ్రేట్ చేయడం కోసం రోజు తగినన్ని వాటర్ తాగడం ముఖ్యం. దీనికోసం రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ తాగాలి. దీని ద్వారా బాడీ నుంచి విష పదార్థాలు బయటకు వెళ్లి చర్మం శుభ్రం అవుతుంది.

3. హెల్తీ డైట్:
తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ముఖ్యం. వీటిలో ఉండే పోషకాలు కారణంగా చర్మం కాంతివంతంగా అవుతుంది.

4. వాకింగ్:
చర్మం నుంచి చమట ద్వారా విష పదార్థాలు బయటకు పోవడం చాలా అవసరం. దీనికోసం రోజు వాకింగ్ చేయడం ముఖ్యం.

5. నిద్ర:
మంచి నిద్ర వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఫేస్ గ్లోగా కనిపిస్తుంది.

ఈ ఐదు టిప్స్ ని ఫాలో అయ్యి ఈ వారం రోజుల్లో మీ ముఖన్ని కాంతివంతంగా చేసుకోండి. అప్పుడు మీ ఫొటోస్ కూడా కాంతివంతంగా వస్తాయి.