టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గత కొద్దికాలం నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకి తెలిసిందే. అందుకే సినిమాలుకు సైతం దూరమై రెస్ట్ తీసుకుంటుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ పిక్స్ ని షేర్ చేస్తుంది. ఇక ఇటీవల పొగలు వస్తున్న బాత్ టబ్ లో మొత్తం ఉండి క్రయో థెరపి చేపించుకుంది. తాజాగా సమంత ఆయుర్వేద వైద్యం కోసం భూటాన్ వెళ్తుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
” వెయ్యేళ్ల క్రితం భూటాన్, ఇండియా మధ్య సత్సంబంధాలుండేవి. ఇరు దేశాల మధ్య రాకపోకలు, ఆచారసంప్రదాయాలు, నాలెడ్జ్ ను షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలోనే ఆయుర్వేదంలోని గొప్పదనం ఇరుదేశాలు పంచుకున్నారు. టిబెట్ లో హాట్ స్టోన్ బాత్ ప్రసిద్ధి చెందింది. ఇండియన్ ఆయుర్వేదం నుంచి ఈ పద్ధతిని వీరు కొనుక్కున్నారు. ఈ హాట్ టబ్ లో ఆ స్టోన్స్ కలిగి వాటిలో ఉన్న శక్తిని వదిలేస్తాయి. అది కేవలం ఈ హాట్ టబ్ లోనే జరుగుతుంది.
ఈ పరిస్థితిని డాట్ ఫో అంటారు. ఇందులో వాడే మూలికాలను కెంపా అంటారు. అవి మన కండరాలకు ఉత్తేజ పరుస్తాయి. ఈ బాత్ టబ్ లోనే ఆ ఆకులన్నీ కూడా వెయ్యాలి. ఐదారు గంటలు వేడి చేసే.. అందులోని శక్తి అంతా బయటకు వస్తుంది. నీటిలో కలుస్తుంది. ఇవి రెండు కలిపి మనలో ఉన్న నొప్పి, బాడీ పెయిన్స్ ఇలా అన్నిటిని మాయం చేస్తుంది ” అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని కోసమే ఈమె విదేశాలకు వెళ్తుందట.