బొప్పాయి పండ్లు మనకి మార్కెట్లో అన్ని సీజన్లో అతి తక్కువ ధరకు దొరికే ఒక ఫ్రూట్. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గించి, అజితి నుంచి బయటపడేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇక బొప్పాయితో దగ్గు, జలుబుతో పాటు మలేరియా, డెంగ్యూ అంటు వ్యాధుల నుంచి కూడా సంరక్షించుకోవచ్చు.
ఈ వ్యాధులు వచ్చినవారు రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క కప్పు చొప్పున బొప్పాయి పండ్లు తింటే త్వరగా కోలుకుంటారు. అలాగే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా బొప్పాయితో బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కాదు చర్మ సౌందర్యానికి, జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. బొప్పాయిని తినడం వల్ల శరీరంలో కొవ్వు సులబంగా తగ్గిపోతుంది.
ఈ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించవచ్చు. షుగర్ ఉన్న వారు కూడా బొప్పాయి పళ్ళను తినవచ్చు. దీనివల్ల షుగర్ స్థాయిలు మెరుగుపడతాయి. బొప్పాయిలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. హై బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సంరక్షిస్తుంది. రోజుకో కప్పు, రెండు కప్పుల బొప్పాయి పండ్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. కనుక ఈ పండుని రోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.