అప్పుడు సమంత-చైతన్య..ఇప్పుడు వరుణ్-లావణ్య..వీళ్లకి ఈ పిచ్చెంట్రా బాబు..!!

ఒకప్పుడు సోషల్ మీడియాలో చైతన్య సమంతల పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోయాయో.. ఇప్పుడు అదే రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి  వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పేర్లు.  రీజన్ ఏంటో తెలియదు కానీ చైతన్య సమంతకు మించిన రేంజ్ లో .. ఇంకా చెప్పాలంటే కూసింత  ఎక్కువగానే వీళ్ళ పేర్లను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  కాగా ఒకప్పుడు డైరెక్టర్ లు  చైతన్య సమంతలతో ఎక్కువగా సినిమాలు చేయాలని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వరుణ్-లావన్య ల  పెళ్ళై కరెక్ట్ గా వారం రోజులు కాకముందే అప్పుడే బడా డైరెక్టర్ లు  వరుణ్ లావణ్య లను భార్యాభర్తలుగా తెరపై చూపించడానికి పలు రకాల స్క్రిప్స్ ను వాళ్లకు వినిపించడానికి రెడీ అయిపోయారట .

అయితే ఈ జంట మాత్రం అప్పుడప్పుడే సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చేస్తుందట.  దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే లావణ్య పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తుందట. కానీ అది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట..!!