మైగ్రీన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చెక్ పెట్టండి..!!

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పుల వల్ల మన ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు సైతం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయి. అయితే ఈ కాలంలో ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువగా వస్తుందని ఒత్తిడి కారణంగా కూడా ఈ తలనొప్పి పెరుగుతూ ఉంటుందని పలువురు నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ప్రశాంతత అనేది చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు.

మైగ్రేన్ తలనొప్పి అంటే కొంతమందికి తలకు ఒక సైడు మాత్రమే వస్తుంది. ఆ నొప్పి చాలా భరించలేనంతగా ఉంటుందని చెప్పవచ్చు.. ఒక్కోసారి రెండు వైపులా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి పురుషులలో కన్నా శ్రీ లలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి వస్తే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అసలు వదిలిపెట్టదు. ఈ తలనొప్పికి చెక్ పెట్టాలి అంటే బెల్లం చాలా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఆవు పాలలోకి కాస్త బెల్లాన్ని కలుపుకొని తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. అల్లం కూడా మైగ్రిన్ సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందట.. అయితే అల్లం రసంలో నిమ్మ రసాన్ని కూడా కలుపుకొని తాగడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చు తలనొప్పి పూర్తిగా తగ్గిపోవాలి అంటే కచ్చితంగా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉండాలి.. ఇలా మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు బెల్లం పాలు లేదా అల్లం టీ నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే ఉపశమనాన్ని పొందవచ్చు.