ఆ డైరెక్టర్ తో నటుడు ప్రభు కూతురు పెళ్లి..!!

తమిళ నటుడు ప్రభు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాను డార్లింగ్, దేనికైనా రెడీ ,ఒంగోలు గిత్త తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. అంతేకాకుండా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించారు ప్రభు.. మొదట హీరోగా తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేయడం జరిగింది. ఈయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విక్రమ్ ప్రభు హీరోగా తమిళంలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

కాగా ప్రభువు కి కూడా ఒక కూతురు ఉన్నది. ఆమె పేరు ఐశ్వర్య ఈమె ఒక స్టార్ డైరెక్టర్ తో వివాహం చేసుకోబోతోంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. 2009లో ఐశ్వర్య కి వివాహం జరిగింది. కొన్ని కారణాల చేత తన భర్త నుంచి విభేదాలు రావడంతో విడిపోయి మళ్లీ తల్లితండ్రుల దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కోలీవుడ్లో వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్గా విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. రవిచంద్రన్ ఐశ్వర్య మంచి స్నేహితులయ్యారని ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి త్వరలోనే ఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన నటుడు ప్రభువు కుటుంబం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి