ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినం ముందుగా మెడికల్ షాప్ కు పరిగెడుతున్నాం. మందులు తెచ్చుకుని వేసేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎక్కువ శాతం ఇంటివైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. పెద్దవాళ్లు ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, గ్యాస్ లాంటి చిన్న చిన్న సమస్యలకైతే మెడికల్ షాప్ వరకు వెళ్లనవసరమే లేదు. ఇంట్లోనే చెక్ పెట్టవచ్చు. అంటే కచ్చితంగా మీ ఇంట్లో కొన్ని ఔషధ మొక్కలు పెంచాల్సి ఉంటుంది. మరి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కలబంద.. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఈ మొక్కలు ఉండాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కలబంద చాలా రకాలుగా సహకరిస్తుంది.
కాలిన గాయాలకు ఔషధం కలబంద. వెయిట్ లాస్, హెల్తీ హెయిర్ కోసం కూడా కలబంద సాయపడుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పెరట్లో వాము మొక్క ఉండాలి. వాము మొక్కలో యాంటీ ఇన్‌ప్లిమెంటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కడుపుబ్బరం, కడుపునొప్పి, గ్యాస్ ఎసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి ఎన్నో సమస్యలకు వామాకులతో చెక్ పెట్టవచ్చు. వామాకులను మరిగించిన నీటిని రోజు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పై చెప్పిన సమస్యలు అన్నిటిని దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసిన మరో ఔషధ మొక్క తులసి. తులసి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు.
తులసి మొక్కను పూజిస్తారు అలాగే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ లక్షణాలు కలిగి ఉన్న తులసి ఆకులతో చేసిన టీను డైట్ లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక సీజన్ వైడ్‌గా వచ్చే పలు రకాల వ్యాధులకు కూడా ఈ తులసి టీతో చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరివేపాకు మొక్క కూడా పెరట్లో పెంచుకోవాలి. కరివేపాకు వంటకు రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తుంది. రోజు కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తలెత్తవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. హెయిర్ హెల్దిగా కూడా ఉంటుంది.