రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్..!!

మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో అమ్మానాన్న ఒక తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా ఆసిన్ నటించగా ప్రకాష్ రాజ్ ,జయసుధ తదితర నటి నటుల సైతం నటించడం జరిగింది. 2003లో ఈ సినిమా విడుదలై ఆ ఏడాది బ్లాక్ బాస్టర్ విజయంగా ఈ సినిమా నిలవడం జరిగింది. మదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఇక ఈ చిత్రాన్ని తమిళంలో మెహన్ రాజ ఎం కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి పేరుతో విడుదల చేయడం జరిగింది.
ఈ చిత్రాన్ని జయం రవి హీరోగా నటించగా హీరోయిన్గా ఆసిన్ నటించింది. జయసుధ క్యారెక్టర్ లో నదియా నటించడం జరిగింది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత ఈ సినిమాతో రి యంట్రి ఇచ్చిన నదియా కు మంచి బ్లాక్ బాస్టర్ పడిందని చెప్పవచ్చు. ఎం కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి -2 పేరుతో సీక్వెల్ రాబోతోంది అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

అయితే ఇందులో హీరోగా జయం రవి నటిస్తున్నారని తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ మెహన్ రాజ ఇటీవలే చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం అఖిల్, నాగార్జున తో కలిసి ఒక మల్టీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అనుకున్నంత స్థాయిలో స్క్రిప్ట్ రాకపోవడంతో ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు స్థానంలోనే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సీక్వెల్ రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.