మళ్లీ జబర్దస్త్ కు జడ్జి మారిందే.. ఖుష్బూ స్థానంలో ఎవరంటే..?

తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న షో ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. అంతలా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా నాగబాబు మాత్రమే ఉండేవారు.దీంతో ఈ షో టిఆర్పి రేటింగ్ లో టాప్ లో ఉండేది. కానీ నాగబాబు రోజా పొలిటికల్ కారణాలవల్ల వారిద్దరు వెళ్లిపోయాక ఈ షోలో కాస్త కామెడీ అశ్లీలత ఎక్కువ అయిందని రోజు రోజుకి ఈ షో ఆదరణ చాలా దారుణంగా తగ్గిపోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇక అనసూయ కూడా యాంకర్ కి గుడ్ బై చెప్పడంతో పాటు సుదీర్, ముక్కు అవినాష్ తదితర కమెడియన్స్ వెళ్లిపోవడం జరిగింది. యాంకర్ గా సౌమ్యరావు గత కొద్దిరోజులుగా ఉండగా ఇప్పుడు ఆమె ప్లేసులో బిగ్ బాస్ సిరి హనుమంతు రావడం జరిగింది. ఇటీవల కాలంలో జబర్దస్త్ షో కి జడ్జిలుగా కృష్ణ భగవాన్, ఖుష్బూ వంటి వారు రావడం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఖుష్బూ ప్లేసులో ఇప్పుడు తాజాగా హీరోయిన్ మహేశ్వరి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పెళ్లి, గులాబీ వంటి చిత్రాలలో నటించి అలరించిన ఈమె ఇప్పుడు జబర్దస్త్ షోలో సందడి చేయడంతో ఈమె అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు. కానీ ఖుష్బూ కామెడీ మార్కు మిస్సయిందని ఆమె అభిమానులు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఈ యొక్క ఎపిసోడ్ కు ఈమె ఉంటుందా లేకపోతే జబర్దస్త్ షో కి అలాగే కొనసాగుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతున్నది.