సలార్ సినిమా అసలు కథ ఇదే.. రివీల్ చేసిన డైరెక్టర్..!!

హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే అభిమానులు సైతం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే సరిగ్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా స్టోరీని లీక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు సలార్ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని చేస్తున్నారు.. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబోతోంది. తాజాగా ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రశాంత్ నీల్ స్టోరీ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు అయ్యే స్టోరీనే సలార్ సినిమా అని ఇందులో స్నేహమనేది మెయిన్ ఎమోషన్ అని ఇప్పుడు రిలీజ్ అయ్యే మొదటి భాగం సగం స్టోరీ చెప్పబోతున్న ఓవరాల్గా ఇద్దరు స్నేహితులు చేసే జర్నీని రెండవ పార్టులు చూపించబోతున్నామని తెలిపారు.

సలార్ సినిమాతో కేజిఎఫ్ కి ఎలాంటి పోలిక ఉండదని స్టోరీ దగ్గర నుంచి ఈ రెండు కూడా డిఫరెంట్ గానే ఉంటాయని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్లకు రెండో భాగం సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని తెలియజేశారు. అయితే సలార్-2 సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయం మాత్రం ఏం చెప్పలేనని తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ అంచనాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి.