రాజకీయ నేతల మధ్య కొన్నిసారూప్యతలు ఉంటాయి. అదే సమయంలో తేడాలు కూడా ఉంటాయి. అయి తే..ఈ సారూప్యతలు ప్రజలకు సేవ చేయడంలో ఉంటే అందరూ మెచ్చుకుంటారు. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. ఇదే నియోజకవర్గం సిట్టింగ్ అభ్యర్థి, బీఆర్ ఎస్ నేత కందాళ ఉపేందర్‌రెడ్డికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు? అంటే.. వెంటనే చెప్పేమాట.. కందాళ గురించే.
నిజానికి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి..తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్నపాలేరు అభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదంటే అతిశయోక్తికాదు. కానీ,ఎమ్మెల్యేగా గెలిచిన కందాళ నిరంతరం.. ప్రజలకు చేరువగా ఉంటారు. అంతేకాదు.. నియోజవకర్గంలో ప్రతి ఒక్కరి దగ్గరా ఎమ్మెల్యే ఫోన్ నెంబరు ఉంటుంది. ఏ సమస్య వచ్చినా.. వారు పిలవగానే పలికే నాయకుడిగా కూడా కందాళకు మంచి పేరు ఉంది. ఇదిలావుంటే, ఇక, పార్టీ మార్పువిషయంలోనూ.. కందాళపై ఎలాంటి విమర్శలూ లేవు.
2018లో కాంగ్రెస్ తరఫున పాలేరు నుంచి విజయం దక్కించుకున్న కందాళ. . తర్వాత కాలంలో బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వికృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో గెలిచి.. దొరలకు జై కొట్టిన చిన్న దొర! అంటూ.. ఆయన కామెంట్లు చేస్తున్నారు. కానీ, వాస్తవానికి పొంగులేటి ముందు కాంగ్రెస్ ఆ తర్వాత పార్టీ మారి వైసీపీలో ఎంపీగా గెలిచి.. తర్వాత బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. ఆ తర్వాత.. కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే.. ఈ వ్యవహారంలో ఆయన వేసిని పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. బేరాలు కుదుర్చుకునేందుకు అనేక అనేక నెలల పాటు చర్చలకు దిగారు.
“మీ పార్టీలోకి వస్తే.. మీరేమిస్తారు ? “ అనే తరహాలో ఆయన అన్ని పార్టీలతోనూ చర్చలు జరిపారు. నియోజకవర్గం మద్దతు దారుల అభిప్రాయం తెలుసుకునే పేరుతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో నెలల తరబడి ఆయన చర్చలు జరిపి.. ఎక్కడ తనకు సేఫ్‌గా ఉంటుందో చూసుకుని అక్కడకు వెళ్లారు. కానీ, కందాళ మాత్రం అలా కాదు. ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి, తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసే కోణంలోనే పార్టీ మారారు.
కేవలం నియోజకవర్గంఅభివృద్ధి చెందాలంటే.. ఇక్కడిప్రజలకు ఏదైనా మేలు చేయాలంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరడమే మంచిదన్న ఏకైక ఆలోచనతో ఆయన వెంటనే పార్టీ మారిపోయారు. దీనిని ఎవరితోనూ చర్చించలేదు. పార్టీ మార్పు పేరుతో కలరింగ్ కూడా ఇవ్వలేదు. బేరాలు అంతకన్నా కుదుర్చుకోలేదు. కానీ, పొంగులేటి పొలిటికల్ హిస్టరీ అంతా.. బేరాలు.. స్వలాభానికి మించిన అవసరం ఏమీ లేదని.. ఆయనకు ప్రజలు సెకండరీ.. అనే టాక్ జోరుగా వినిపిస్తుండం గమనార్హం.