పంటి నొప్పి సమస్యలా.. ఇంటి చిట్కాలను పాటించండి..!!

కొంతమంది ఉదయం లేవగానే బెడ్ కాఫీ, టీ వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. ముఖ్యంగా దంతాలను శుభ్రం చేసుకోకుండానే ఇలాంటి తప్పులు చేయడం వల్ల పంటి నొప్పి, చిగురు సమస్యలు, నోటి నుంచి దుర్వాసనలు కూడా ఎదురవుతూనే ఉంటాయి.. ఇవే కాకుండా పలు రకాల ఇబ్బందుల వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుందని చెప్పవచ్చు. దీనివల్ల ప్రతిరోజు చేసే పనుల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుందట..ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మన ఇంట్లో దొరికేటువంటి ఉప్పు లవంగాలను బాగా పొడిగా నూరి రాత్రి పడుకునే ముందు నొప్పిగా ఉన్న దంతాల మీద కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే ఉదయానికల్లా ఆ నొప్పి తగ్గిపోతుందట.

ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పళ్ళ మధ్యలో నొక్కి పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చట.

పులుపు వల్ల దంతాలను దెబ్బతినే బ్యాక్టీరియాను సైతం నయం చేస్తుంది. అందుకే నిమ్మరసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో నిమ్మరసాన్ని పిండి పుక్కిలించటం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చేదుకు సైతం పండు పుచ్చిపోయిన అందులో నుంచి కొన్ని బ్యాక్టీరియా సైతం బయటికి రావడానికి వేప ఆకులు చాలా ఉపయోగపడతాయి ఈ రసాన్ని గ్లాసులో కలుపుకొని పుక్కిలించటం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.

ఒక చిన్న గిన్నెలో కాస్త నీటిని కాస్త పసుపు పొడి వేసుకొని.. కొన్ని ఉప్పు రాళ్లను వేసి పేస్టులా చేసిన తర్వాత ఆ పేస్టుని పళ్ళ దంతాల పైన అప్లై చేస్తే కచ్చితంగా పంటి నొప్పి తగ్గిపోతుందట.