ఫ్యామిలీ హెచ్చరిస్తున్నా వినకుండా గంజాయి సప్లై చేస్తున్న మెగా హీరో… పట్టుబడితే అంతే…!!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలలో ఒకడైన సాయి ధరమ్ తేజ్.. రీసెంట్ గా విరూపాక్ష, బ్రో సినిమాలతో సక్సెస్ అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. ఇక తాజాగా ” గాంజా శంకర్ ” సినిమాతో ప్రేక్కు ల‌ ముందుకి రానున్నాడు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక నిన్న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ గురించి మాట్లాడుకుంటే..” చిన్న పాప స్పైడర్‌ మ్యాన్, సూపర్ మ్యాన్ కథ కూదు నాన్న.. మన లోకల్ మ్యాన్ కథ చెప్పు అని తండ్రిని అడుగుతుంది.

చిన్నప్పుడు చదువు మానేసి, తల్లిదండ్రులు చెప్పింది వినకుండా అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతాడని..జర్దా, గుట్కా వంటి దరిద్రపు అలవాట్లతో పాటు ఈజీ లీవ్స్ పండిస్తాడని.. గాంజా పేరు చెప్పకుండా గంజాయి అమ్ముతాడని సాయి ధరమ్ తేజ్ పాత్ర గురించి చిన్నారికి చెబుతాడు తండ్రి. అలా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ స్మోక్ చేస్తూ మాస్ లుక్ లో గంజాయి అమ్ముకునే రోడ్డు సైడ్ మ్యాన్గా కనిపించగా..” ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.