అర్ధరాత్రి సమంతకు అలాంటి మేసేజ్ చేసిన జిమ్ ట్రైన‌ర్‌.. సామ్ ఏం చేసిందంటే..?

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రీసెంట్గా నటించిన ” ఖుషి ” సినిమా యావరేజ్ హిట్ తెచ్చుకున్నప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ముందడుగు వేస్తూ వెళ్తోంది. అయితే సామ్ ఆరోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది.

ఇదంతా పక్కన పెడితే సమంత జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, వెకేష‌న్స్, వృత్తిపర, వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన జిమ్ ట్రైనర్ జునైద్ చేసిన మెసేజ్ స్క్రీన్ షార్ట్ ను కూడా పంచుకుంది. ఆదివారం జిమ్ నుంచి కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నానని సామ్ అనుకుంది.

కానీ రాత్రి 11 గంటలకు జిమ్ ట్రైనర్ తనకు మెసేజ్ పెట్టి మరి గుర్తు చేశాడు. నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇవాళ రెస్ట్ తీసుకుంటున్నానని సమంత రిప్లై ఇచ్చింది. కానీ జునైద్ నేను జిమ్ లోనే ఉన్నాను అన్నట్లుగా మెసేజ్ పెట్టాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.