`పోకిరి` వ‌ల్ల రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన మ‌హేష్ బాబు.. అంత డ్యామేజ్ ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో ఫ‌స్ట్ ఇండిస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టించింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డుల‌ను తుడిచి పెట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను అందుకుంది.

మ‌హేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. కానీ, నిజానికి ఈ సినిమా వ‌ల్ల మ‌హేష్ బాబుకు లాభ‌మే కాదు న‌ష్టం కూడా గ‌ట్టిగానే జ‌రిగింది. పోకిరి త‌ర్వాత మ‌హేష్ వ‌రుస ఫ్లాపుల‌ను ఫేస్ చేశాడు. ఆయ‌న నుంచి ఆ సినిమా వ‌చ్చినా ప్రేక్ష‌కులు పోకిరితో పోల్చి చూసేవారు. దాంతో ఆడియెన్స్ అంచ‌నాల‌ను అందుకోలేక‌ మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేవి.

అలా కంటెంట్ బాగున్నా స‌రే సైనికుడు, అత‌డు, ఖ‌లేజా వంటి సినిమాలు ప‌రాజ‌యం పాల‌య్యాయి. పోకిరి సినిమాతో పోల్చి చూడ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అస‌లే సెన్సిటివ్ అయిన మ‌హేష్ బాబు ఈ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ను తట్టుకోలేక‌పోయాడు. ఒకానొక స‌మ‌యంలో పోకిరి మూవీ ఎందుకు చేశానా అని మ‌హేష్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఏడ్చారట‌. ఇక మార్కెట్ డౌన్ అయిపోతున్న స‌మ‌యంలో మ‌హేష్ బాబు దూకుడు మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు.