దసరా పండుగని ఎందుకు జరుపుకోవాలని పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

దేశవ్యాప్తంగా ఎంతో మంది కోలాహాలంగా జరుపుకునే పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ లోకాలను పట్టిపీడిస్తూ ఉండగా.. శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బహువులుగా,  బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన అమ్మవారు.. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది . ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది.  దేవితో తలపడిన అసురుడు మహిషి రూపం,  సింహరూపం,  మానవ రూపముతో భీకరంగా పోరాడి చివరికి మహిషిరూపంలో దేవి చేతిలో హతమయ్యాడు.  అందుకే ఈ దినాన్ని దసరా పర్వదినంగా పిలుస్తారు. అలాగే  రాముడు.. రావణుడు పీడను వదిలించిన రోజు కూడా ఈ రోజే అని ఈ పండుగను దసరా సందర్భంగా జరుపుకుంటూ ఉంటారు.  చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా కూడా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తూ ఉంటారు.
ముఖ్యంగా త్రేతా యుగంలో రాముడు రావణుడు పైన దండెత్తి మరీ విజయాన్ని అందుకోవడంతో రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెట్టడం సాంప్రదాయంగా వస్తోంది..అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు జరుగుతాయి. పదవరోజు విజయదశమి జరుపుకుంటూ ఉంటారు.  ఆలయాలలో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజిస్తూ ఉంటారు మహిళలు . లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కరోజు ఒక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది అందువల్లే అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ప్రజలు.
దసరా పండుగ రోజున జమ్మి ఆకులకు మంచి విశిష్టత ఉంది.. మహాభారతంలో పాండవులు ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ అనే వృక్షం పైన ఉంచుతారు.. తమ అజ్ఞాతవాసం పూర్తి అయ్యేవరకు ఆ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడుతూ ఉండమని ఆ వృక్షాన్ని కోరుతారు.అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకుంటారు.  అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడిస్తారు.. అందుకే  అప్పటినుంచి విజయదశమి రోజున ఈ శమీ వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు. అందుకే ఆయుధాల పూజను కూడా చేసుకుంటూ ఉంటారు.ఇకపోతే దసరా పండుగ 23న జరుపుకోవాలని ఇంద్రకీలాద్రి పండితులు కూడా చెప్పినట్లు సమాచారం.