నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా పండుగ కానుకగా భారీ అంచనాల విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. అలాగే గత కొన్నేళ్ల నుంచి రిపీట్ అవుతున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ ను సైతం భగవంత్ కేసరి బ్రేక్ చేసి పడేసింది.
ఈ దసరాకు తెలుగులో భగవంత్ కేసరితో పాటు మాస్ మహారాజా రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` కూడా విడుదల అయింది. కానీ, టైగర్ నాగేశ్వరరావుకు మిశ్రమ స్పందన లభించింది. టాక్ పాజిటివ్ గా లేకపోవడంతో బాలయ్య ముందు రవితేజ సినిమా ఏ మాత్రం నిలబడలేకపోతోంది. అయితే వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు పోటీ పడ్డారు.
2008లో బాలకృష్ణ ఒక్కమగాడు, రవితేజ కృష్ణ, 2009లో రవితేజ కిక్, బాలకృష్ణ మిత్రుడు, 2011లో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ పరమవీరచక్ర ఒకేసారి విడుదల అయ్యాయి. అయితే ప్రతిసారి బాలయ్యపై రవితేజనే గెలుస్తూ వచ్చాడు. దీంతో రవితేజతో పోటీ పడితే బాలయ్యకు ఫ్లాప్ ఖాయం అన్న బ్యాడ్ సెంటిమెంట్ వచ్చేసింది. కానీ, ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేసేశాడు. భగవంత్ కేసరి హిట్ దిశగా దూసుకుపోతుంటే.. టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ వైపుగా వెళ్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను ఎవడ్రా ఆపేదంటూ సంభరాలు చేసుకుంటున్నారు.