రోడ్డు ప‌క్కన టీ అమ్ముకుంటున్న ర‌జ‌నీకాంత్‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగులు ఉంటార‌ని అంటుంటారు. ఏడుగురిని మనం చూడకపోయినా ఒకరు లేదా ఇద్దరినీ ఒకే పోలికలతో ఉండడం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పోలిక‌ల‌తో ఉన్న ఓ వ్య‌క్తి వెలుగులోకి వ‌చ్చాడు. అత‌డిని దూరం నుంచి చూస్తే ర‌జ‌నీకాంతే అని భ్ర‌మ ప‌డ‌టం ఖాయం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు ప‌క్క‌న టీ అమ్ముతూ క‌నిపించాడు. అత‌డిని చూడ‌గానే నాదిర్ షా ఒక్క‌సారిగా షాకైపోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకుని ఉన్న స‌ద‌రు వ్య‌క్తిని దూరం నుంచి చూస్తే సేమ్ టూ సేమ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే కనప‌డ్డాడు.

దాంతో నాదిర్ షా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆరాలు తీయ‌గా.. అతని పేరు సుధాకర్ ప్రభు అని తెలిసింది. ర‌జ‌నీకాంత్ పోలికలు ఉండ‌టంతో అత‌డితో నాదిర్ షా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో సుధాక‌ర్ ప్ర‌భును చూడ‌టానికి చుట్టు ప‌క్క జ‌నాలు అత‌డి టీ కొట్టు వ‌ద్ద‌కు ఎగ‌బ‌డుతున్నారు. దీంతో అత‌ని టీ వ్యాపారం మ‌రింత పుంజుకుంది.