సీనియర్ హీరోలలో బాలయ్య నెంబర్ వన్.. కారణాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల మధ్య ఇప్పుడు నెంబర్ వన్ గేమ్ నడుస్తోంది. కుర్ర హీరోలు జోరుగా చూపిస్తూ ఉండడంతో సీనియర్ హీరోలు కాస్త వెనుకబడ్డారని చెప్పవచ్చు. కానీ వీళ్లలో కేవలం ఒక్కరు మాత్రమే తగ్గేదే లేదంటూ పోటీగా దూసుకు వెళ్తున్నారు.. మిగిలిన సీనియర్ హీరోలు సైతం ఒక్క హిట్టు అందుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ చేసే సినిమాలు విషయంలో స్పెషల్ క్రేజ్ అందుకుంటోంది.

అయితే ఇందులో కొంతమంది హీరోలు అభిమానుల అంచనాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి పరిస్థితి కూడా ఇదే మారిపోయింది. నాగార్జున వెంకటేష్ పరిస్థితి కూడా ఇలానే ఏర్పడుతోంది..సక్సెస్ విషయంలో కాస్త వెనుకబడ్డారు కానీ ఈ సిచువేషన్ లో నందమూరి బాలయ్య మాత్రం వరుస విజయాలతో ముందుకు వెళుతున్నారు.. గడిచిన మూడు చిత్రాలలో బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య ఒక్కసారిగా రేంజ్ పెరిగిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా బాలయ్య మార్కెట్ భారీగానే పెరిగిపోయింది. మొదటిసారి ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్కెట్ ని టచ్ చేసిన సీనియర్ హీరోలలో ఒకరిగా బాలయ్య పేరు సంపాదించారు. అలా అత్యధికంగా వన్ మిలియన్ మార్కెట్ను ఓవర్సీస్ లో టచ్ చేసి సీనియర్ హీరోలు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారని ప్రూఫ్ చేశారు బాలయ్య. ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ బాబి తో సరికొత్త సినిమాని చేయబోతున్నారు ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.