మరోసారి సక్సెస్ కొట్టేలా ఉన్న సుడిగాలి సుదీర్.. సహస్ర మూవీ టీజర్ వైరల్..!!

మొదట జబర్దస్త్ నటుడుగా మంచి క్రేజీ సంపాదించిన సుధీర్ ఆ తర్వాత ఎన్నో షోలకు హోస్టుగా చేసి మరింత క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలలో నటించిన సుధీర్ గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ చేతిలో రెండు మూడు సినిమాలలో ఉన్నట్లు తెలుస్తోంది.అందులో ఒకటి కాలింగ్ సహస్ర మరొకటి గోట్.. కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కాస్త షూటింగ్ గ్యాప్ రావడం జరిగిందట.

ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. ఇందులో సుధీర్ సరసన డోలిష్య హీరోయిన్గా నటిస్తోంది. షాడో మీడియా ప్రొడక్షన్ రాధా ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా కొన్ని గంటల క్రితం సరికొత్త పోస్టర్ను విడుదల చేస్తే దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్లో సుధీర్లు చాలా భయంకరంగా కనిపిస్తున్నది. మరొక పోస్టర్తో రక్తంతో నిండిన కత్తిని చూపిస్తూ కనిపించారు.

మరో పోస్టర్లు హీరోయిన్ వీల్ చైర్ లో ఉండగా ఆమె వెనుక కత్తి పట్టుకుని సుదీర్ నిలబడ్డాడు.. అంతేకాకుండా అందుకు సంబంధించి ఒక టీజర్ కూడా వైరల్ గా మారుతోంది. అయితే ఈ పోస్టర్లన్నీ కూడా క్లైమాక్స్ లో తీసినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సుధీర్ తో పెట్టుకుంటే తలలు తెగిపోవడం ఖాయమని మేకర్స్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉందట.