టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా పేరు సంపాదించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని విడిపోవడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. మోడల్గా మొదట తన కెరీర్ ని మొదలు పెట్టి తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె బద్రి సినిమాలో తెలుగు తెరకు అడుగుపెట్టింది. నటిగానే కాకుండా ఈమె మంచి డిజైనర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో వివాహమైన తర్వాత ఈమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అందులో ఒకరు అకిరా ఆధ్య..
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెర పైన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్.. ఇందులో స్టువర్టపురం దొంగలను మార్చే సామాజిక కార్యకర్తగా హేమలత లవణం అనే పాత్రలు ఈమె నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ పెళ్లి విషయం గురించి రాజకీయాల విషయాల గురించి మాట్లాడడం జరిగింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ తను రెండవ పెళ్లి చేసుకోవాలని ఉంది తప్పనిసరిగా చేసుకుంటానని అయితే తనకు రెండు మూడేళ్ల సమయం పడుతుందని తెలియజేసింది.
ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాలు అంటే తనకు ఆసక్తి లేదని పొలిటికల్ అనే పదం తన కెరీర్ లోనే ఒక నెగటివ్ పదంగా మారిపోయిందని మన సమాజంలో మా పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలనుకుంటారు.. కానీ ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు రాజకీయ నేత కావాలని కోరుకోరు అంతగా రాజకీయాలు అంటే అభిప్రాయం ఉంది. కానీ తనకు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని లేదని తెలిపింది. కానీ తనకు తెలిసినంతవరకు సోషల్ సర్వీస్ వంటివి చేస్తూ ఉంటానని తెలిపింది రేణు దేశాయ్.