ఎస్ ..ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఇలాంటి కామెంట్స్ తోనే తమ కోపాన్ని బయటపెడుతున్నారు. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు పాన్ ఇండియా హీరో పుట్టినరోజు అంటే ఏ రేంజ్ లో హంగామా ఉండాలి బాక్సాఫీస్ వద్ద .. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమాలు ఒక్కటంటే ఒక్క అప్డేట్ రిలీజ్ చేయలేదు . ప్రాజెక్ట్ కె.. సల్లార్ ..రాజా డీలక్స్ ఇలా ఒక్కదానికి సంబంధించిన అప్డేట్స్ సైతం రివీల్ చేయలేదు. కేవలం కన్నప్ప సినిమా నుంచి మాత్రం ఆయనకు బర్త్డ డే విషెస్ అందజేశారు మూవీ టీం .
అయితే ప్రభాస్ రేంజ్ కి ఆ ఒక్క చిన్న విషెస్ సరిపోదు . దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . ప్రభాస్ ని పెట్టుకొని కోట్లు పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడం కాదు కాస్త ఫాన్స్ గురించి కూడా ఆలోచించండి .. మా అన్న బర్త డే కి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని హర్ట్ చేశారు అంటూ ఫైర్ అయిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ .
మరికొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అయుతే ” ఇదేం బతుకు మాది.. ప్రభాస్ పుట్టినరోజుకి ఒక్క చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదే” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి బలైపోతున్నారు ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించే మేకర్స్ . ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ కోపంలోనూ న్యాయం ఉంది. చిన్న హీరోల పుట్టినరోజులకే నానా హంగామా చేస్తూ ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పుట్టిన రోజుకి హంగామా ఏ స్టైల్ లో ఉండాలి . ధూమ్ ధామ్ అంటూ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాలి. మరి అలాంటిది ప్రభాస్ పుట్టినరోజు అంటే మేకర్స్ కి చీమకుట్టినట్లు కూడా లేదే..? దీనికి కారణం ఏమై ఉంటుంది..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!