రాజమౌళి ఆ హీరోయిన్ ని పీకల్లోతు లవ్ చేశాడా..? ఆ కారణం తోనే పెళ్లి వద్దు అనుకున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా జ్ఞాపకాలను తవ్వి లోడి బయటకు తీస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఎప్పుడెప్పుడో జరిగిన వార్తలను సైతం మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. కాగా అలాంటి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అది స్టార్ హీరోకి స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన వార్త కావడంతో జనాలు సైతం ఎక్కువగా ఆ వార్తను ట్రెండ్ చేస్తున్నారు . రాజమౌళి దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు జక్కన్న . అయితే జక్కన్న రమా అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అప్పటికే ఆమెకు పెళ్లయింది . ఓ బాబు కూడా ఉన్నాడు . అయినా సరే ప్రేమ ..ఎప్పుడూ ..ఎవరికీ ..ఎలా పుడుతుందో..? ఎవరు చెప్పలేరుగా . అందుకే రాజమౌళికి రమను చూడగానే ప్రేమ కలిగింది పెళ్లి చేసుకున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేశారు .

అయితే రమా కంటే ముందే రాజమౌళి ఓ హీరోయిన్ ని ప్రేమించారట. కానీ ఆ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేదట . అప్పటికే లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోవడం.. పైగా ఇండస్ట్రీలో తనకు గుర్తింపు కూడా లేకపోవడంతో ..ఆమె పెద్ద హీరోయిన్ కావడంతో రాజమౌళి తన ప్రేమ విషయాన్ని చెప్పకుండానే దాచి పెట్టేసారట . సెటిల్ అయ్యాక చెబుదామనుకునే టయానికి ఆమె లైఫ్ లో సెటిల్ అయిపోయింది . దీంతో రాజమౌళికి ప్రేమ అంటేనే విరక్తి వచ్చి దూరంగా ఉన్నారట . ఫైనల్లీ రమాను చూడగానే మళ్లీ ప్రేమ పుట్టింది. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!