యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అవ్వకుండా ఉండి ఉంటే.. ఏమైయేవాడో తెలుసా..?

ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఆ తర్వాత ఆయన నటించబోయే సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిబోతున్నదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమాకి కమిట్ అయ్యారు . బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో కమిట్ అయిన ఎన్టీఆర్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోగా కాకుండా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ అయ్యుండేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే కామెంట్స్ చేశారు . యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ముందు నుంచి సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదట . చాలా రిజర్వ్డ్ గా సైలెంట్ గా ఉండేవాడట . అయితే ఫ్రెండ్స్ వద్ద మాత్రం బాగా యాక్టివ్గా అల్లరి అల్లరిగా ఉండేవాడట.

ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి డాక్టర్స్ వృత్తిపై చాలా గౌరవం కలిగిన ఎన్టీఆర్ పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలనుకున్నాడట . ఎప్పుడైతే సీనియర్ ఎన్టీ రామారావు గారు తారక్ ని చూసి వీడు కచ్చితంగా హీరో అవుతాడు అని చెప్పాడో..? అప్పటినుంచి ఆయన డ్రీమ్ మార్చేసుకున్నారట . సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వెళ్లాలి అని ..తాత పరువును నిలబెట్టాలి అని ఫిక్స్ అయిపోయారట . ప్రజెంట్ అదే పనిలో ఉన్నాడు తారక్ . ఒకవేళ డాక్టర్ అయ్యుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ ఓ మంచి నటుడిని మిస్ అయిపోయి ఉండేది అంటున్నారు నందమూరి అభిమానులు..!!