శ్రీ లీల మాటలకు సిగ్గుతో ఊగిపోయిన అమర్దీప్… మీరు బాగున్నారంటూ కామెంట్లు…!!

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే పన్ డే అన్నట్లే వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్ లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతివారం ఎవరో ఒక గెస్ట్ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడడం..చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సందడిగా గడుస్తుంది. ఈవారం కూడా బిగ్ బాస్ షో కి అతిధులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, అందాల తార శ్రీ లీల వచ్చారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ బిగ్ బాస్ షో కి వచ్చినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ రియాలిటీ షో కి అనిల్ రావిపూడి పెద్ద అభిమాన్ని. తన సినిమాలు ఉన్న లేకపోయినా ప్రతి సీజన్ కి మాత్రం వచ్చేస్తాడు. ఈసారి వచ్చి రావడంతో తలదైనా పంచులతో ఇచ్చిపడేశాడు. పనిలో పనిగా.. సీజన్ సీజన్ కి టిఆర్పి తో పాటు మీ గ్లామర్ కూడా పెరుగుతుందంటూ నాగార్జునను పొగిడేసాడు. హౌస్ మేట్స్ గురించి చెబుతూ.. తేజ కాలేజీలో తన జూనియర్ అని.. బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాడు.

ఇక శోభా శెట్టి ని క్రాకర్ అని.. అందరినీ ఒక ఆట ఆడుకుంటుందని చెప్పాడు. ఇక అమర్దీప్ లేచి.. ” శ్రీ లీల గారు మీరు ఏం చెప్పట్లేదండి ” అనీ అనగా.. ” మీరు చాలా బాగున్నారండి అని ఆమె చెప్పింది “. అయితే మనోడికి అర్థం కాలేదేమో.. సింపుల్ గా థాంక్యూ అండి అని కూర్చోబోయాడు. వెంటనే నాగార్జున కలగజేసుకుని.. ఆమె ఏం చెప్పిందో అర్థమైందా? నువ్వు చాలా బాగున్నావ్ అని చెప్పింది అని అనగా.. అమర్ సిగ్గుతో ముగ్గులేసాడు.