వాట‌ర్ లో సెగ‌లు రేపిన ప్రియా వారియర్.. పద్ధతిగా చీరకట్టి ఈ ప‌నులేంటి త‌ల్లీ?!

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కన్నుగీటు వీడియోతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. 2019లో `ఓరు అదార్ లవ్` మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది. దీంతో ప్రియా వారియ‌ర్ కు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

అలాగే తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో చెక్‌, ఇష్క్‌, 4 ఇయర్స్, లైవ్ త‌దితర చిత్రాలు చేసింది. రీసెంట్ గా తెలుగులో బ్రో మూవీలో మెరిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌క‌పోయినా.. ప్రియా వారియ‌ర్ కు అడ‌పా త‌డ‌పా ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా వారియ‌ర్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారును అల్లాడించేస్తుంటుంది.

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. వైట్ క‌ల‌ర్ చీర‌లో ముస్తాబైన ప్రియా వారియ‌ర్‌.. చెరువులో దిగి జలకాలాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఒంపుసొంపులు పోతూ వాట‌ర్ లో సెగ‌లు రేపింది. హాట్ స్పాట్స్ ను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రియా వారియ‌ర్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. కుర్రాళ్లు మెండ‌లెక్కిపోతున్నారు. పద్ధతిగా చీరకట్టి ఈ ప‌నులేంటి త‌ల్లీ అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.