ప్రతి సినిమాలో లిప్ లాక్స్ ఎందుకు ఉంటాయి..? నాని సమాధానం వైరల్..

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ హాయ్ నాన్న. ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా సందడి చేసిన మూవీ టీం మీడియా సమావేశంలో తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. నాని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలను వివరించాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పెళ్లికాకముందు నుంచే ఒక ఆడపిల్లకు తండ్రిని కావాలని ఎన్నో కలలు కన్నానని ఈ సినిమాతో తనకు కలలో జీవించే అవకాశం దొరికిందని వివరించారు.

తాను కూడా ఆడపిల్ల తండ్రిని అనే అనుభూతిని పొందినట్లు నాని చెప్పుకొచ్చాడు. హాయ్ నాన్న చూస్తున్నంతసేపు ఎమోషనల్ గా అందరూ కనెక్ట్ అవుతారని ఇలాంటి అందమైన స్క్రిప్ట్ లో నటించే అవకాశం రావడం నాకు అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజలకు ఊహాలను మించి ఈ సినిమా ఉంటుందని వివరించిన నాని.. తొలత ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయాలనుకున్నారని అయితే ముందుగానే విడుదల చేయడానికి కారణం వివరించాడు. నాని రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం అంత ఈజీ కాదని ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే టీం మొత్తం డిస్కస్ చేసి డిసెంబర్ 7 మూవీ డేట్‌గా ఫిక్స్ చేసామని వివరించాడు.

ఇప్పటికే ఫాదర్ సెంటిమెంట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో స్పెషల్ ఏంటి అని అడగగా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఆ సినిమా స్పెషాలిటీ ఏంటో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. విడుదల తేదీ దగ్గరికి వచ్చేసరికి హాయ్ నాన్న కథ పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక మీరు నటించిన ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అలా ఎందుకు..? అని అడగగా నేను నటించినా అన్ని సినిమాల్లో అలా లేవు.. సీన్స్ కు అవసరమైతే డైరెక్ట‌ర్‌ తప్పకుండా ఆ సీన్ కావాలని చెప్తే చేస్తాను.. అంతే ఇలాంటి సీన్స్ తర్వాత మా ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి (నవ్వుతూ) అని నాని మాట్లాడాడు.