అదిరిపోయిన వెంకటేష్ సైంధవ్ టీజర్..!!

సీనియర్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. చాలా మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేశారు.. ఇప్పటికీ కూడా మల్టీస్టారర్ చిత్రాలు అంటే కచ్చితంగా వెంకటేష్ ని ఎంచుకుంటారు. అలాగే ఇటీవల రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్తో తెరకెక్కించడం జరిగింది.

ఇప్పుడు మరొక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రమైన సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క పోస్టర్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు తండ్రి కూతుర్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలను కూడా హైలెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇటీవలే టీజర్ ని విడుదల చేయగా ఈ టీజర్ పైన భారీగా అంచనాలు పెంచేసాయి.. ఈ టీజర్ తరువాత మరో గణేష్ సినిమాలా ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.. సైంధవ్ సినిమా మొత్తం గన్స్ మాఫియా డ్రగ్స్ చుట్టు తిరిగేలా కనిపిస్తోంది. వెంకటేష్ ఇందులో విలన్స్ కి వార్నింగ్ ఇవ్వడం వంటివి చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి ప్రస్తుతం ఈ సినిమా టీజర్ మాత్రం వైరల్ గా మారుతోంది.